IND vs WI 3rd ODI: మెరిసిన సిరాజ్, శ్రేయాస్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం! సిరీస్ క్లీన్‌స్వీప్!!
IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది.
India beat West Indies in 3rd ODI: వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ 169 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 96 పరుగులు జయభేరి మోగించింది. దాంతో 3-0తేడాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. విండీస్ బ్యాటర్ ఒడియన్ స్మిత్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లు మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు పడగొట్టారు.
ఛేదనకు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. నాలుగో ఓవర్లో ఓపెనర్ షాయ్ హోప్ (5)ను మహమ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఐదవ ఓవర్లో బ్రెండన్ కింగ్ (14), షమార్ బ్రూక్స్ (0)లను దీపక్ చహర్ వెనక్కి పంపించాడు. దీంతో విండీస్ 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (34), డారెన్ బ్రావో (20)లు ఇన్నింగ్స్‌ని చక్కదిద్దేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యారు.
ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (6), ఫేబియన్ అలెన్ (0) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇన్నింగ్స్ చివరలో ఓడీన్ స్మిత్ (36: 18 బంతుల్లో 3×6,3×4) ధాటిగా ఆడి స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే సిరాజ్ అతడిని పెవిలియన్ చేర్చాడు. ఆపై అల్జారీ జోసెఫ్ (29), హేడెన్ వాల్ష్ (13: 38 బంతుల్లో 1×4) వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని కూడా హైదరాబాద్ గల్లీ బాయ్ సిరాజ్ వెనక్కి పంపాడు. రోచ్ నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి పడగొట్టగా.. దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్నటీమిండియాకి ఆరంభంలోనే భారీ షాకులు తగిలాయి. అల్జారీ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (13) బౌల్డ్ కాగా.. ఐదో బంతికి మాజీ సారథి విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. శిఖర్ ధావన్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత రిషబ్ పంత్ (56) కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (6) త్వరగానే ఔట్ అయ్యాడు. ధాటిగా ఆడే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ (80) బ్రావోకి చిక్కాడు. దాంతో 187 పరుగులకే భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ చివరలో దీపక్ చహర్ (38), వాషింగ్టన్ సుందర్ (33) ధాటిగా ఆడడంతో భారత్ పోరాడే స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు.. అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
Aslo Read: IPL 2022 Auction: ఐదుగురు ఆటగాళ్లపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. వారు చాలా కాస్ట్లీ గురూ!!
Also Read: Kalaavathi Song Promo: 'సూపర్ స్టార్' అభిమానులకు సర్‌ప్రైజ్.. ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook