India beat West Indies in 4th T20I: వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది. ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే పట్టేసింది. బ్యాటర్ల సమష్టి కృషికి బౌలర్లు తోడవ్వడంతో.. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో రోహిత్ సేన సునాయాస విజయం సాధించింది. 59 పరుగుల తేడాతో గెలిచి.. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 ఆధిక్యంతో ఖాతాలో వేసుకుంది. పేసర్ అవేశ్‌ ఖాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. కీపర్ రిషబ్ పంత్‌ (44; 31 బంతుల్లో 6×4), కెప్టెన్ రోహిత్‌ శర్మ (33;16 బంతుల్లో 2×4,3×6), వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ (30 నాటౌట్‌; 23 బంతుల్లో 2×4,1×6), స్టార్ బ్యాటర్ సూర్య కుమార్‌ (24; 14 బంతుల్లో 1×4,2×6), యువ ప్లేయర్ దీపక్‌ హుడా (21; 19 బంతుల్లో 2×4), ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ (20నాటౌట్‌; 8 బంతుల్లో 1×4,2×6) సమష్టిగా రాణించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. విండీస్‌ స్టార్ బౌలర్‌ ఒబెద్ మెకాయ్‌ 4 ఓవర్లలో 66 పరుగులిచ్చాడు.


అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను భారత్‌ బౌలర్లు అడ్డుకున్నారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లు విండీస్ స్కోరు బోర్డును ఏ దశలోనూ ముందుకు కదలనివ్వలేదు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (24), నికోలస్‌ పూరన్( 24) మినహా మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.



Also Read: CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!


Also Read: శ్రీకృష్ణుడే ఎంచుకున్న వైద్యుడితడు.. అమాంతం అంచనాలు పెంచేసిన రెండో ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook