Karthikeya 2 Trailer 2: శ్రీకృష్ణుడే ఎంచుకున్న వైద్యుడితడు.. అమాంతం అంచనాలు పెంచేసిన రెండో ట్రైలర్

Nikhil's Karthikeya 2 movie Trailer released. ఆగస్టు 13న  కార్తికేయ 2 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నేడు చిత్ర యూనిట్ రెండో ట్రైలర్ను వదిలింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2022, 06:59 PM IST
  • ఆగస్టు 13న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా కార్తికేయ 2
  • రెండో యూనిట్ విడుదల చేసిన సినిమా యూనిట్
  • అమాంతం అంచనాలు పెంచేసిన ట్రైలర్
Karthikeya 2 Trailer 2: శ్రీకృష్ణుడే ఎంచుకున్న వైద్యుడితడు.. అమాంతం అంచనాలు పెంచేసిన రెండో ట్రైలర్

Nikhil's Karthikeya 2 movie Trailer 2 released: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కార్తికేయ 2'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2014లో విడుదలైన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే మొదటి భాగంలో స్వాతి హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. 'కార్తికేయ 2 నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, సహా టీజర్లు, ఒక ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక జులై 22న విడుదల కావలసిన సినిమా అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 13న విడుదల కానున్న నేపథ్యంలో నేడు చిత్ర యూనిట్ సినిమా నుంచి రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ను రవితేజ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. రెండు నిముషాల ఎనిమిది సెకన్ల నిడివిగల ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం, ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం .. అంటూ సాగిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News