Virat Kohli, Jasprit Bumrah rested for West Indies T20 series: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతిని ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన వన్డే జట్టులో కూడా ఈ ఇద్దరు లేరన్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాయంతో జట్టుకు దూరంగా ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ ఇద్దరు మ్యాచులు ఆడడం వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది. పొట్టి సిరీస్ ఆరంభ సమయానికి రాహుల్ఎం కుల్దీప్ గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులోకి వస్తారు. సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ కూడా జట్టులోకి వచ్చాడు. ఇక పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం దక్కలేదు.


పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్‌, ఆవేశ్ ఖాన్‌లను బీసీసీఐ సెలెక్టర్లు కొనసాగించారు. భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లు అవకాశం దక్కింది. ఇటీవలి కాలంలో ఫినిషర్ రోల్ పోషిస్తున్న దినేశ్ కార్తీక్ జట్టులో ఉన్నాడు. వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ పొట్టి సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. జులై 22 నుంచి విండీస్‌ పర్యటనఆరంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్‌ అనంతరం జులై 29 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. 


టీ20 జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్ కార్తిక్‌‌, రిషబ్ పంత్‌, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, కుల్దీప్ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్‌‌, అవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. 


వన్డే జట్టు
రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మొహ్మద్ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. 


Also Read: Bahubali Scene: 'బాబుబలి' సీన్ రిపీట్.. అచ్చు రమ్యకృష్ణ మాదిరే చిన్నారిని కాపాడిన తల్లిదండ్రులు!  
Also Read: Nokia 2660 Flip: నోకియా నుంచి డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్... ధర ఎంతో తెలుసా..  



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook