Bahubali Scene: 'బాహుబలి' సీన్ రిపీట్.. అచ్చు రమ్యకృష్ణ మాదిరే చిన్నారిని కాపాడిన తల్లిదండ్రులు!

Telangana Rains, Bahubali Movie Scene repeat in Manthani. మూడు నెలల పసికందును కాపాడేందుకు కుటుంబ సభ్యులు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సీన్‌ను రిపీట్ చేశారు. 

Written by - P Sampath Kumar | Last Updated : Jul 14, 2022, 06:16 PM IST
  • బాహుబలి సీన్ రిపీట్
  • రమ్యకృష్ణ మాదిరే చిన్నారిని కాపాడిన తల్లిదండ్రులు
  • పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు
Bahubali Scene: 'బాహుబలి' సీన్ రిపీట్.. అచ్చు రమ్యకృష్ణ మాదిరే చిన్నారిని కాపాడిన తల్లిదండ్రులు!

Manthani Parents saved child like Ramyakrishna in Bahubali Movie: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.  వర్షపు నీటికి వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు పట్టణం, గ్రామాలు కూడా జలమయయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం జలమయం అయింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో మంథనిలోని అంబేద్కర్ నగర్, వాసవీనగర్‌, మర్రివాడ, దొంతలవాడ, బోయిన్ పేటలోని ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

మర్రివాడకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో.. స్థానికులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మూడు నెలల పసికందును కాపాడేందుకు కుటుంబ సభ్యులు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సీన్‌ను రిపీట్ చేశారు. మహేంద్ర బాబుబలిని కాపాడేందుకు రమ్యకృష్ణ నది దాటుతూ.. తాను మునిగిపోయినా తన చేతిలో బాబును పెట్టుకుని కాపాడుతుంది. ఇక్కడ మాత్రం ఓ బేషన్ తట్టలో చిన్నారిని పెట్టుకుని వరద నీటిని దాటారు. 

మూడు నెలల పసికందును తన తల్లిదండ్రులు ఓ తట్టలో పెట్టుకుని.. పైన టవల్ చుట్టారు. ఆపై నెత్తిమీద తట్ట పెట్టుకుని భుజాల వరకు వచ్చిన నీటిలో మెల్లిగా ముందుకు నడవ సాగారు. చివరకు ఒడ్డు చేరుకుని చిన్నారిని సురక్షితంగా కాపాడారు. వరద నీరు దాటున్నా చిన్నారి ఏడవకపోవడం గమనార్హం. ఈ సీన్‌ను చుట్టుపక్కల వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై అందరూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: IND vs ENG 2nd ODI: భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే పిచ్‌, వెదర్ రిపోర్ట్.. టీమిండియా గెలిస్తే..!  

Also Read: Nokia 2660 Flip: నోకియా నుంచి డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్... ధర ఎంతో తెలుసా..  

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News