India Cricket Schedule: స్వదేశంలో మూడు జట్లతో సిరీస్‌లు.. హైదరాబాద్, వైజాగ్‌లలో మ్యాచ్‌లు! పూర్తి షెడ్యూల్ ఇదే
BCCI announces schedule for home series against SL, AUS and NZ. 2022-23 షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది.
BCCI announces schedule for home series against Sri Lanka, New Zealand and Australia: 2022-23 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. 2023 ఆరంభంలో శ్రీలంక, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో భారత్ వరుసగా స్వదేశంలో సిరీస్‌లను ఆడనుంది. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్‌కు ముందు భారత్ బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. ఆపై ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫికేషన్ మరియు వన్డే ప్రపంచకప్ 2023 కూడా ఉన్నాయి.
ముందుగా శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 3 నుంచి 15వ వరకు లంక పర్యటన ఉంటుంది. లంక సిరీస్ ముగిసిన వెంటనే కివీస్‌తో తొలుత మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20లను ఆడనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్ పర్యటన షెడ్యూల్ అయింది. ఇక ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలను భారత్ ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు ఈ టూర్ ఉంటుంది. న్యూజిలాండ్‌తో జనవరి 18న హైదరాబాద్ వేదికగా వన్డే మ్యాచ్, ఆస్ట్రేలియాతో మార్చి 19న వైజాగ్ వేదికగా వన్డే మ్యాచ్ జరగనుంది.
శ్రీలంక షెడ్యూల్:
మొదటి టీ20: జనవరి 3, ముంబై
రెండో టీ20: జనవరి 5, పుణె
మూడో టీ20: జనవరి 7, రాజ్‌కోట్
తొలి వన్డే: జనవరి 10, గువాహటి
రెండో వన్డే: జనవరి 12, కోల్‌కతా
మూడో వన్డే: జనవరి 15, త్రివేండ్రం
న్యూజిలాండ్ షెడ్యూల్:
తొలి వన్డే: జనవరి 18, హైదరాబాద్
రెండో వన్డే: జనవరి 21, రాయ్‌పుర్
మూడో వన్డే: జనవరి 24, ఇండోర్
మొదటి టీ20: జనవరి 27, రాంచీ
రెండో టీ20: జనవరి 29, లక్నో
మూడో టీ20: ఫిబ్రవరి 1, అహ్మదాబాద్
ఆస్ట్రేలియా షెడ్యూల్:
తొలి టెస్టు: ఫిబ్రవరి 9 నుంచి 13, నాగ్‌పుర్
రెండో టెస్టు: ఫిబ్రవరి 17 నుంచి 21, ఢిల్లీ
మూడో టెస్టు: మార్చి 1 నుంచి 5, ధర్మశాల
నాలుగో టెస్టు: మార్చి 9 నుంచి 13, అహ్మదాబాద్
మొదటి వన్డే: మార్చి 17, ముంబై
రెండో వన్డే: మార్చి 19, వైజాగ్
మూడో వన్డే: మార్చి 22, చెన్నై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.