సౌతాఫ్రికాతో 3వ టీ20 ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో 3వ టీ20 ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ
బెంగళూరు: ఆటను సరిగ్గా అంచనా వేయలేకపోవడమే సౌతాఫ్రికాతో 3వ టీ20 ఓటమికి కారణమైందని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా బౌలింగ్ బాగుంది. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ కూడా వారికి అనుకూలంగా మారింది. అదేకాకుండా ఆటను అంచనా వేయడంలో టీమిండియా విఫలమైందని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సెరెమనీలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 9 వికెట్ల తేడాతో 3వ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 1-1 తో సమం చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలను క్వింటన్ డికాక్ ముందుండి విజయం వైపు నడిపించాడు. 52 బంతుల్లో 79 పరుగులు(4x6, 6x5) చేసి సౌతాఫ్రికా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మరో మూడు ఓవర్లు మిగిలి వుండగానే సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది.