Avesh Khan likely to play 2nd ODI in place of Prasidh Krishna: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత యువ జట్టు ఉత్కంఠ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. నేడు (జులై 24) జరిగే రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. ఏ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని విండీస్ చూస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది. మ్యాచ్ నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి చుద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి వన్డేలో శిఖర్ ధావన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌లను దాటి వచ్చిన అవకాశాన్ని గిల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఈ మ్యాచులో కూడా అతడు ఓపెనింగ్ చేయడం ఖాయం. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా..  సూర్య, హుడా, శాంసన్ ఈ మ్యాచులో అయినా పరుగులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా శాంసన్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. 


సీనియర్ల గైర్హాజరీలో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని ముందుడి నడిపిస్తున్నాడు. తొలి వన్డేలో అద్భుత బౌలింగ్‌తో జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. అతడికి శార్దూల్ ఠాకూర్ సహకరించగా.. ప్రసిధ్ కృష్ణ మాత్రం భారీగా పరుగులు ఇచ్చాడు. దాంతో రెండో వన్డేలో ఐపీఎల్ స్టార్ అవేశ్ ఖాన్ జట్టులోకి రానున్నాడు. అవేశ్ జట్టులోకి వస్తే అతడికి భారత్ తరఫున ఇదే తొలి వన్డే కానుంది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్‌ రాణిస్తున్నారు. రవీంద్ర జడేజా లేని కారణంగా అక్షర్ స్థానానికి ఏం డోకాలేదు. 


తుది జట్టు (అంచనా):
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్. 


Also Read: Neeraj Chopra Family: నీరజ్‌ చోప్రా కుటుంబ సభ్యుల సంబరాలు.. ప్రధాని మోదీ అభినందనలు (వీడియో)  


Also Read: Saturn Transit 2022: శని తిరోగమనం.. ఈ 3 రాశుల వారికి మహాపురుష రాజయోగం.. 141 రోజులు ఇక తిరుగే ఉండదు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.