Saturn Transit 2022: శని తిరోగమనం.. ఈ 3 రాశుల వారికి మహాపురుష రాజయోగం.. 141 రోజులు ఇక తిరుగే ఉండదు..

Saturn Transit 2022: ప్రస్తుతం శని తిరోగమన కాలం నడుస్తోంది. 141 రోజుల పాటు ఈ తిరోగమనం కొనసాగుతుంది. ఈ కాలంలో 3 రాశుల వారికి మహాపురుష రాజయోగం పట్టనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 11:43 AM IST
  • శని తిరోగమన కాలం
  • జూన్ 5 నుంచి అక్టోబర్ 23 వరకు తిరోగమనంలో శని
  • ఈ కాలం 3 రాశుల వారికి కలిసొస్తుంది
Saturn Transit 2022: శని తిరోగమనం.. ఈ 3 రాశుల వారికి మహాపురుష రాజయోగం.. 141 రోజులు ఇక తిరుగే ఉండదు..

Saturn Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని న్యాయ దేవత. ఆయా రాశుల వారి కర్మానుసారం ఫలితాలను అందజేస్తాడు. శని గమనం రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది.ఇది కొన్ని రాశుల వారికి మంచి చేయవచ్చు.కొన్ని రాశుల వారికి కీడు చేయవచ్చు. ప్రస్తుతం శని మకర రాశిలో సంచరిస్తున్నాడు. మకర రాశికి శని అధిపతి. వృషభ రాశిని వీడి శని మకరంలోకి ప్రవేశించాడు. జూన్ 5 నుంచి తిరోగమనంలో ఉన్న శని అదే స్థితిలో ప్రస్తుతం మకరంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 23, 2022 వరకు శని తిరోగమనంలోనే ఉంటాడు. జూన్ 5 నుంచి అక్టోబర్ 23 వరకు మొత్తం 141 రోజుల కాలం శని సంచార ప్రభావం 3 రాశుల వారికి కలిసిరానుంది. ఆ మూడు రాశుల వారికి మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఆ 3 రాశులేంటి.. మహాపురుష రాజయోగంతో కలిగే ప్రయోజనాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం... 

మేషం (Aries) : మహాపురుష రాజయోగంతో మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నవారికి పెద్ద పదవులు దక్కవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త జాబ్ ఆఫర్ రావొచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. ఈ కాలంలో చేపట్టే పనులన్నీ సక్సెస్ అవుతాయి.

మిథునం (Gemini) : శని తిరోగమన కాలం మిథున రాశి వారికి అదృష్ట కాలం. ఉద్యోగ, వ్యాపారస్తులు సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారవేత్తలకు పెద్ద మొత్తంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి కారణంగా మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి.. వారి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం దక్కుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి భారీగా ఆదాయం పెరుగుతుంది. 

కన్య (Virgo) : మహాపురుష రాజయోగం కన్యారాశి వారికి సిరులు కురిపిస్తుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ పథకాలు, ఏవైనా పనుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Bonalu Festival: నేడు లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు... నేటితో బోనాల పండగ ముగింపు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..  

Also Read: Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News