India Probable Playing vs Australia for 1st T20: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి టీ20 జరగనుంది. మొహాలీ వేదికగా నేడు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. భారత జట్టు పటిష్టంగానే ఉన్నా.. ఆసియాకప్ 2022 ప్రదర్శన చూస్తే మాత్రం ఆందోళన కలిగించక మానదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయిన రోహిత్ సేన.. సూపర్ 4 నుంచి తిరిగి వచ్చింది. ఈ ఓటమి టీమ్ మేనేజ్‌మెంట్ ముందు అనేక ప్రశ్నలను మిగిల్చింది. దాంతో వచ్చే నెల ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు భారత్ సరైన జట్టును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ టాప్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తోంది. ప్రపంచకప్‌ 2022లో కేఎల్‌ రాహులే ఓపెనింగ్‌ చేస్తాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. దాంతో రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఆడతారు. రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో ఓ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం ఉంటుంది కాబట్టి.. మేనేజ్మెంట్ రిషబ్ పంత్ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. దాంతో దినేష్ కార్తీక్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఫినిషర్ కావాలనుకుంటే మాత్రం పంత్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. దీపక్ హుడా ఆసియా కప్‌లో విఫలమయ్యాడు కాబట్టి అతడికి చోటు దక్కడం కష్టమే. 


రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడనున్నాడు. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లు కాబట్టి ఒక స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం యుజ్వేంద్ర చహల్ తుది జట్టులో ఉంటాడు. ఒక స్పిన్నర్ ఆడితే.. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ ఇద్దరు జట్టులో ఉంటారు. అప్పుడు నలుగురు పేసర్లతో భారత్ ఆడాల్సి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ సహా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. మరి రోహిత్ శర్మ ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటాడో చూడాలి. 


భారత్ తుది జట్టు (అంచనా): 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా. 


Also Read: Amarinder Singh: కాషాయ కండువా కప్పుకున్న కెప్టెన్ అమరీందర్​ సింగ్..


Also Read: అక్టోబరులో సూర్య, కుజ, శని గ్రహాల సంచారం... ఈ రాశులవారికి ఊహించని ధనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి