కివీస్ టార్గెట్ 180.. సిరీస్‌పై కన్నేసిన భారత్
NZVsIND 3rd T20 Live Updates | మూడో టీ20లో ఆతిథ్య కివీస్‌కు భారత్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరోవైపు సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో కివీస్ పైనే ఒత్తిడి ఉంది.
హామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకు భారత్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ (65; 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (27; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో ఓటయ్యాడు.
కివీస్ బౌలర్లలో బెన్నెట్‌ను భారత ఆటగాళ్లు ఉతికి ఆరేశారు. అతడు 3 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నాడు. శాంట్నర్, గ్రాండ్ హోమ్ చెరో వికెట్ తీశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (38; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. చివరి ఓవర్లో భారత్ ఏకంగా 18 పరుగులు సాధించి న్యూజిలాండ్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే కివీస్ ఈ టీ20 తప్పనిసరిగా నెగ్గాలి. దీంతో కివీస్ పైనే ఒత్తిడి ఉంటుంది.
ఈ టీ20లో న్యూజిలాండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. బ్లెయిర్ టిక్‌నర్‌ను తప్పించిన మేనేజ్ మెంట్ అతడి స్థానంలో స్కాట్ కుగ్లెజన్ కు జట్టులోకి తీసుకుంది. మరోవైపు భారత్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించగా.. మూడో టీ20లో టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ తీసుకోవడం గమనార్హం.