India Squad For World Cup 2023: వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టు ఖరారు అయింది. శనివారం అర్ధరాత్రి బీసీసీఐ సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీ వరల్డ్‌ కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన తరువాత హెడ్ కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో భేటీ అయిన సెలెక్షన్ కమిటీ.. టీమ్‌ను ఫైనలైజ్ చేసింది. అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించేందుకు సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఐసీసీ గడువు ఇచ్చింది. కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉండడంతో బీసీసీఐ టీమ్‌ ప్రకటించడం ఆలస్యం చేసింది. బెంగళూరులోని ఎన్‌సీఏ రాహుల్ ఫిట్‌నెస్‌పై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 15 మంది కూడిన సభ్యులను ఖరారు చేసింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఉండగా.. ఇషాన్ కిషన్ బ్యాకప్ కీపర్‌గా చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రపంచ కప్ టీమ్ నుంచి వైదొలిగారు. టాప్ ఆర్డర్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నారు. 


ఆల్‌రౌండర్లుగా హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ చోటు దక్కించుకోగా.. పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్, మహ్మద్ షమీ పంచుకోనున్నారు. స్పిన్ స్పెషలిస్ట్‌గా కుల్దీప్ యాదవ్ పేరు ఖరారు అయింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణకు కూడా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. స్టార్ స్పిన్నర్ చాహల్‌కు కూడా నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది.  


వరల్డ్ కప్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.


Also Read: India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు.. ఫలితం తేలని మ్యాచ్..


Also Read: Ishan Kishan: ధోనీ ఆడిన జార్ఖండ్ జట్టుకు ఇషాన్ కిషన్ ఎందుకు మారాడు..? అసలు నిజం ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook