భారత మహిళా హాకీ జట్టు ఆసియా కప్ ఫైనల్‌లో అదరగొట్టింది. ఫైనల్‌లో చైనాపై 5-4 స్కోరుతో గెలుపొంది రికార్డు సాధించింది. తద్వారా 2018లో జరిగే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత పొందింది. 2004 తర్వాత అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టులో ఆసియా కప్ గెలవడం ఇదే ప్రథమం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌ను ఓడించిన మన జట్టు, ఇప్పుడు చైనాపై దూసుకుపోయింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కజకిస్తాన్‌పై కూడా గెలిచింది.


ఆ గేమ్‌లో నవజ్యోత్ కౌర్ 25 నిముషంలో తొలి గోల్ చేసి భారత్‌కు శుభారంభాన్ని అందించగా, ఆ తర్వాత చైనా కూడా గోల్ చేయడంతో 47వ నిముషం వరకు ఇరు పక్షాలూ సమఉజ్జీలుగానే నిలిచాయి. మ్యాచ్ ముగిసే సమయానికి ఇక ఫలితం తేల్చడం కోసం షూటౌట్ అనివార్యమైంది.


అందులో కూడా ఇరు జట్టులు కూడా 4-4 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే చివరి అవకాశాన్ని భారత కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ కొట్టి సస్పెన్స్‌‌కి తెరదించింది. భారత్‌కు ఆసియా కప్‌ని అందించింది.