నాగ్ పూర్ లాంటి బౌలర్లకు అనుకూలించే పిచ్ పై టీమిండియా కెప్టెన్ అద్బుత సెంచరీ సాధించాడు. ఇలా టీమిండియకు తానెందుకు అత్యుత్తమ బ్యాట్స్‌మనో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఫలితంగా ఆసీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమమానికి 250 పరుగులు చేయగల్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యువ ఆటగాడు విజయ్ శంకర్ 46 పరుగులతో రాణించాడు. మిగిలిన టీమిండియా బ్యాట్సోమెన్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో ధోనీ, శిఖర్ ధావన్ డకౌట్ గా వెనుదిరగడం గమనార్హం.


ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ ( 120 బంతుల్లో 116 పరుగులు) పూర్తి చేసి భారత్ కు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్లు కమ్మింగ్స్ 4 వికెట్లు తీయగా యువ బౌలర్ జంపా కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు