IND vs AUS Day 2 Highlights: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆతిథ్య జట్టు టీమిండియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో సరికొత్త రికార్డులు సృష్టించగా.. ఆల్‌రౌండర్ల రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు అజేయంగా 8వ వికెట్‌కు 81 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 144 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలసిందే. రేపు సాధ్యమైనంత వేగంగా పరుగులు చేసి.. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో రోజు ఆట ప్రారంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ జాగ్రత్తగా ఆడారు. 23 పరుగులు చేసిన అశ్విన్‌ను టాడ్ మర్ఫీకి పెవిలియన్‌కు పంపించాడు. ఆ తరువాత ఛెతేశ్వర్‌ పుజారా (7) కూడా వెంటనే ఔట్ అయ్యారు. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో కలిసి లంచ్‌కు ముందు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. తొలి సెషన్‌ ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.


లంచ్ తర్వాత రెండో సెషన్ ఆట ప్రారంభమైన వెంటనే విరాట్ కోహ్లీ రూపంలో టీమిండియాకు మరో దెబ్బ తగిలింది. 12 పరుగులు చేసిన కోహ్లీ త్వరగా పెవిలియన్‌కు చేరిపోయాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్..  ఫోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే 20 బంతులు ఎదుర్కొన్న కేవలం 8 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఎండ్‌లో పాతుకుపోయిన కెప్టెన్ రోహిత్ శర్మకు రవీంద్ర జడేజాతో జత కలిశాడు. ఇద్దరు ఆసీస్ స్పిన్నర్లను సమర్థవంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రోహిత్ టెస్ట్ క్రికెట్‌లో తన 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ సమయానికి ఆట నిలిపివేసే సరికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.


చివరి సెషన్‌లో కంగారూ కెప్టెన్ పాట్ కమిన్స్ 120 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద  రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపించి ఊపిరి పీల్చుకుంది. అనంతరం కాసేపటికే అరంగేట్ర ప్లేయర్ కేఎస్‌ భరత్‌ కూడా 8 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఇక్కడి నుంచి టీమిండియా ఆలౌట్ అవ్వడం లాంఛనమే అనుకున్నారు. అయితే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పోరాడారు. మరో వికెట్ పడకుండా అర్ధ సెంచరీలతో రాణించారు. టీమిండియాను మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలబెట్టారు. రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ జట్టులో టాడ్ మర్ఫీ 5 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియాన్, కెప్టెన్ పాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.


Also Read: Womens T20 World Cup: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పాక్‌తో పోరుకు స్మృతి మంధాన దూరం..!  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి