Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ
Rohit Sharma & Virat Kohli Away from New Record with 2 runs: మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
Rohit Sharma & Virat Kohli 2 Runs Away to Hits Fastest 5000 ODI Runs: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం అయింది. ఆసీస్, భారత్ జట్లు మొదటి రెండు వన్డేల్లో చెరొక విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. సొంతగడ్డపై గత 26 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓటమనేది తెలియని భారత్.. జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది.
మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Rohit Sharma-Virat Kohli)లు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. రోహిత్-కోహ్లీ జోడి మరో 2 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన జంటగా నిలవనున్నారు. 85 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్-కోహ్లీ జోడి ఇప్పటివరకు 4998 పరుగులు చేసింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో మరో రెండు పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన జంటగా చరిత్ర సృష్టించనున్నారు.
వన్డేల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన జోడిగా వెస్టిండీస్ జంట గోర్డాన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ పేరిట ఉంది. 97 ఇన్నింగ్స్‌లో 5000 వేల పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జంట మాథ్యూ హెడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ 104 ఇన్నింగ్స్‌లలో 5 వేల రన్స్ చేశారు. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ జోడి మరో రెండు రన్స్ చేస్తే.. వెస్టిండీస్, ఆస్ట్రేలియా జోడిల రికార్డ్స్ బద్దలు కానున్నాయి. ఈ జాబితాలో నాలుగు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే.. 60 కంటే ఎక్కువ యావరేజ్ ఉన్న ఏకైక జోడి రోహిత్-కోహ్లీ మాత్రమే.
ఇక వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన జంట సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీలదే. సచిన్-గంగూలీలు 8227 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ జోడి 8వ స్థానంలో ఉంది. ఇక మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఆస్ట్రేలియా మాత్రం రెండు మార్పులు చేసింది.
Also Read: Brave Lady Traps Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. a
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి