సిడ్నీ వేదికగా జరగనున్న కీలకమైన నాల్గో టెస్టులో ఆసీస్ పై టీమిండియా భారీ స్కోర్ సాధించింది. పుజరా, పంత్ లు సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ కలలో కూడా ఊహించని స్కోర్ కోహ్లీ సేన సాధించింది. నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు  ఓవరై నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీసేన మరో 319 పరుగులు జోడించింది. ఫలితంగా రెండు రోజుల ఆటలో మొత్తం 167  ఓవర్లు ఎదుర్కొని ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. రెండో రోజు ఆటకు 10 ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్ ను 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఆసీస్ కు బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వణుకుపుట్టించే ప్రత్యర్ధు స్కోరు కళ్ల ముందు పెట్టికొని బరిలోకి దిగిన ఆసీస్ జట్టు .. 10 ఓవర్లు ఎదుర్కొని వికెట్లేమి కోల్పోకుండా 24 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్ హారిస్ 19, ఉస్మాన్ ఖ్వాజా 5 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 


పుజారా డబుల్ సెంచరీ మిస్..పంత్,జడేజా వీరవిహారం
భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే తొలిరోజు పరుగుల వరద పారించిన పుజారా డబుల్ సెంచరీకి కాస్త దూరంలో 193 వద్ద ఔట్ అయ్యాడు.. వికెట్ కీపర్ పంత్ 159 పరుగులు (189 బంతుల్లో) నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండో నుంచి జడేజా 81 పరుగులు (114 బంతులు) రాబట్టాడు. ఈ ఇద్దరు వన్డే తరహాలో ఆడి అభిమానులను అలరించారు. ఇది ఉండగా ఉదయం పుజారాతో ఇన్నింగ్ ప్రారంభించిన హనమ విహారి మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. తొలి రోజు అగర్వాల్ మెరుపులు మెరిపించి 77 పరుగల వద్ద ఔట్ అయిన విషయం తెలిసిందే. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 23, రెహానే 18 పరుగులతో తక్కువ స్కోర్లకే పెలిలియన్ బాటపడ్డారు..ఏది ఏమైనప్పటికీ టీమిండియా సమిష్టిగా రాణించి 600 పైచిలుగు పరుగులను రాబట్టడం గమనార్హం. ఆసిస్ బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్ లియాన్ 4 వికెట్లు తీయగా..హజిల్ వుడ్ 3 వికెట్ల పడగొట్టాడు. అలాగే పేసర్ మిచెల్ స్ట్రాక్ ఒక వికెట్ మాత్రమే తీశాడు