Ind vs Aus Test: నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి, సిరీస్ 2-1 ఆసీస్ వశం
Ind vs Aus Test: అనుకున్నదే జరిగింది. నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఫలితంగా నాలుగు టెస్ట్‌ల సిరీస్ కాస్తా 2-1తో చేజారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశల్ని ఆసీస్ నిలుపుకుంటే ఇండియా కోల్పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus Test: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్‌లో భారత అభిమానులకు నిరాశే మిగిలింది. కంగారూలపై 184 పరుగుల తేడాతో భారీ పరాజయం ఎదుర్కొంది. 2-1తో ఆసీస్ సిరీస్ కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసీస్ వశమైంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ టీమ్ ఇండియా గెల్చుకోగా మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటి ఆస్ట్రేలియా విజయం సాధించగా మరొకటి డ్రాగా ముగిసింది. దాంతో నాలుగో టెస్ట్ బాక్సిండ్ డే టెస్ట్ గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనలో ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడిన టీమ్ ఇండియా గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. ఆ తరువాత 120 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా టీమ్ ఇండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టార్గెట్ చేధించేందుకు బరిలో దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరోసారి విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత యశస్వి జైశ్వాల్-రిషభ్ పంత్ ఆదుకున్నారు. పంత్ 30 పరుగులకు వెనుదిరిగాడు. జైశ్వాల్ 84 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక ఆ తరువాత నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఎవరూ నిలవలేకపోయారు. 340 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియాను ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం 155 పరుగులకే ఆలవుట్ చేశారు. దాంతో 184 పరుగుల భారీ ఆధిక్యంతో ఆతిధ్య జట్టు విజయం సాధించింది. టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
Also read: US Visa Updates: భారతీయ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, లక్ష నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు మంజూరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.