US Visa Updates: భారతీయ విద్యార్ధులకు అమెరికా గుడ్‌న్యూస్. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా ఇండియా నుంచి యూఎస్ చేరే విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు వీసాల సంఖ్య పెంచడంతో మరింత పెరగనుంది.
అమెరికా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది దాదాపు 10 లక్షల వీసాలు మంజూరు చేసింది. ముఖ్యంగా భారతీయ విద్యార్ధులకు ఈ వీసాలు జారీ చేసింది. వరుసగా రెండో ఏడాది ఇంత భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేసింది యూఎస్ ఎంబసీ. ఒక్క ఇండియా నుంచే పెద్ద సంఖ్యలో విదేశాలకు విద్యార్ధులు తరలి వెళ్తుంటారు. అమెరికా 3 లక్షల 31 వేలమంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. విదేశీయలకు యూఎస్ ప్రభుత్వం తాత్కాలిక ప్రాదిపదికన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేస్తుంటుంది. గత రెండేళ్లుగా పెద్ద సంఖ్యలో వీసాలు పొందుతున్న దేశంగా ఇండియా నిలిచింది. ఈ సంఖ్య 19 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో నవంబర్ వరకూ 20 లక్షలకు పైగా భారతీయులు యూఎస్ చేరారు. ఇది 2023తో పోలిస్తే 26 శాతం అధికం.
ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్లిన విద్యార్ధుల్లో అత్యధికంగా ఇండియా నుంచే కావడం గమనార్హం. ఏకంగా 3,31 లక్షలమంది చదువు నిమిత్తం యూఎస్ వెళ్లారు. హెచ్ 1బి వీసారా రెన్యువల్ ప్రాజెక్టు విజయవంతమైంది. గత నాలుగేళ్లుగా 20 లక్షలమంది భారతీయులు అమెరికా సందర్శించారు. గత నాలుగేళ్లుగా అమెరికా సందర్శించేవారి సంఖ్య ఐదింతలు పెరిగింది. అమెరికాలోనే ఉంటూ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం అనుమతించింది.
50 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులు కలిగి ఉన్నారని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ప్రతిరోజూ వేలాదిగా దరఖాస్తులు చేరుతున్నాయి. ఇడియాలో ఉంటున్న అమెరికన్లకు యూఎస్ మిషన్‌లో భాగంగా 2.40 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.