India vs Australia: ప్రతీకారం తీర్చుకునేందుకు కుర్రాళ్లు సిద్ధం.. నేడే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్
Ind vs Aus Under-19 World Cup Final Preview: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అండర్-19 వరల్డ్ కప్ ఫైట్ ఆదివారం జరగనుంది. రెండు జట్లు గ్రూపు, సూపర్ సిక్స్, సెమీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఫైనల్ ఫైట్ ఆసక్తికరంగా సాగనుంది.
Ind vs Aus Under-19 World Cup Final Preview: అండర్-19 వరల్డ్ కప్‌లో ఫైనల్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. గత నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్‌లో సీనియర్ జట్టుకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు యంగ్ ఇండియాకు సరైన అవకాశం. ఫైనల్ వరకు ఛాంపియన్ ఆటతీరును కనబర్చిన కుర్రాళ్లు.. ఫైనల్ పోరులోనూ అదే జోరు కొనసాగించి విశ్వకప్‌ను ముద్దాడాలని చూస్తున్నారు. కంగారులతో సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. ఆసీస్‌పై గెలిస్తే రికార్డుస్థాయిలో ఆరోసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్ హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకోగా.. పాకిస్థాన్‌పై కష్టపడి గెలిచి ఆసీస్ తుది పోరుకు చేరుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోని వేదిక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: Lottery: పిల్లల పేర్లతో నాన్నకు వరించిన అదృష్టం.. రూ.33 కోట్ల లాటరీ సొంతం
యంగ్ ఇండియా అన్ని పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఫైనల్ ఫైట్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా ఫైనల్‌కు చేరుకున్నారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టును ముందుండి నడిపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉదయ్‌కు తోడు సచిన్ దాస్, ముషీర్ ఖాన్ బ్యాటింగ్‌లో దుమ్ములేపుతున్నారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్-3లో ఈ ముగ్గురే ఉన్నారు. ఉదయ్ 389 పరుగులు చేయగా.. ముషీర్ 338, సచిన్ 294 రన్స్ చేశారు. బౌలింగ్‌లో సౌమి పాండే, నమన్ తివారి ప్రత్యర్థులను వణికిస్తున్నారు. పాండే 17 వికెట్లు తీయగా.. నమన్ తివారి 10 వికెట్లు పడగొట్టారు. ఫైనల్‌కు వరకు కనబర్చిన ఆటతీరును కనబరిస్తే.. టీమిండియా కప్‌ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ఆస్ట్రేలియాకు కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఆ జట్టు కూడా ఫైనల్ పోరుకు అజేయంగానే చేరుకుంది. కెప్టెన్ హ్యూ విబ్జెన్, హ్యారీ డిక్సన్ బ్యాటింగ్‌లో కీ రోల్ ప్లే చేస్తుండగా.. పేసర్లు టామ్ స్ట్రాకర్, కలం విడ్లర్ బౌలింగ్‌లో రాణిస్తున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లకు కుర్రాళ్లు చెక్ పెడితే.. యంగ్ ఇండియాకు తిరుగుండదు. గతంలో 2012, 2018 ఫైనల్ పోరులో కంగారులను ఓడించింది భారత్. ఈసారి కూడా చెక్ పెట్టాలని కుర్రాళ్లు సమరోత్సాహంతో సిద్ధంగా ఉన్నారు.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే.
ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలివర్ పీక్, టామ్ కాంప్‌బెల్, రాఫ్ మాక్‌మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.
Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్ క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook