India vs England 1st ODI Highlights: పుణె: పూణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు 318 పరుగుల భారీ లక్ష్యా న్ని విధించింది. లక్ష్య ఛేదనలో తొలుత రెచ్చిపోయినట్టే కనిపించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. తొలుత 15 ఓవర్లలో 135 పరుగులు రాబట్టిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో (Jason Roy, Jonny Bairstow) జోడికి కొత్త బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) బ్రేకులేశాడు. జేసన్ రాయ్ 46 పరుగుల వద్ద ఉండగా ప్రసిద్ధ్ కృష్ణ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన బెన్ స్టోక్స్ (Ben Stokes) కూడా 11 బంతులు ఆడి 1 పరుగుకే వెనుతిరిగాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : India vs England 1st ODI: అరుదైన ఘనతకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ


బెయిర్ స్టో, ఇంగ్లాండ్ కెప్టేన్ ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. శార్దూల్ థాకూర్ (Shardul Thakur) రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా బెయిర్ స్టో వ్యక్తిగత స్కోర్ 94 పరుగుల వద్ద ఉండగా అతడిని ఔట్ చేసిన శార్ధూల్ థాకూర్ ఆ తర్వాత మోర్గాన్, జోస్ బట్లర్‌లను ఒకే ఓవర్‌లో పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఒక్కసారిగా ఆట మళ్లీ భారత్ వైపు తిరిగింది. ఇక అది మొదలు ఇంగ్లాండ్ కోలుకోలేదు.


టీమిండియా బౌలర్ల ధాటికి ఒకటి తర్వాత ఒకటిగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌.. 42.1 ఓవర్లలో 251 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సేన 1-0తో ఆధిక్యం సొంతం చేసుకున్నట్టయింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook