Virat Kohli about India vs England 1st ODI win: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్ని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌పై విజయాన్ని మధురమైన విజయంగా అభివర్ణించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ విజయానికి బాటలు వేసిన ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తాడు. '98 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి తన వంతు కృషి చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan), కేఎల్ రాహుల్, స్వల్ప వ్యవధిలోనే 9 వికెట్లు తీసిన బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు' అని విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శన చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని కోహ్లీ పేర్కొన్నాడు. ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. మ్యాచ్‌ని మలుపు తిప్పిందెవరంటే..


ప్రస్తుతం టీమిండియాకు టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదని, ఓపెనర్స్ నుంచి టెయిల్ ఎండర్స్ వరకు ఏ దశలోనైనా తమ సత్తా చాటుకునే ఆటగాళ్లు ఉన్నారని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ''ఇవాళ శిఖర్ ధావన్ ఆడిన తీరు, అతడు సాధించిన 98 పరుగులు స్కోర్ బోర్డులో చూపించే స్కోర్ కంటే విలువైనవి'' అని చెబుతూ ధావన్‌ని కోహ్లీ అభినందనల్లో ముంచెత్తాడు. 106 బంతుల్లో 98 పరుగులు సాధించిన Shikhar Dhawan మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. 


Also read : India vs England 1st ODI: అరుదైన ఘనతకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ


మరోవైపు ఇంగ్లాండ్ (England) ఓటమి గురించి ఆ జట్టు కెప్టేన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. 'జట్టులో సత్తా చాటుకున్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఎగ్జ్‌క్యూషన్‌లోనే విఫలం అవుతోంది' అని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ పర్యటన మొత్తం అదే స్పష్టంగా కనిపించిందన్న మోర్గాన్ (Eoin Morgan).. ఈ మ్యాచ్‌లో ఆడినదానికంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook