India vs England 1st Test: టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా ఇషాంత్ శర్మ ఈ ఫీట్ చేరుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1994లో అత్యధిక వికెట్లు తీసిన ఆల్ రౌండర్‌గా రిచర్డ్ హ్యడ్లీ వికెట్లు రికార్డును అధిగమిస్తూ 432వ వికెట్‌ను ఇదే రోజు కపిల్ దేవ్(Kapil Dev) పడగొట్టాడు. తాజాగా అదే రోజున 300 వికెట్ల మైలురాయిని భారత పేసర్ ఇషాంత్ శర్మ చేరుకున్నాడు. 98వ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ నేడు ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఈ మార్కు చేరుకున్నాడు. 


Also Read: India vs England: వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం, తొలి ఇన్నింగ్స్‌‌లో 337 పరుగులకు Team India ఆలౌట్


కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న మూడో ఫాస్ట్ బౌలర్‌‌గా నిలిచాడు ఇషాంత్ శర్మ(Ishant Sharma). కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ 92 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌గా కొనసాగుతున్నాడు.


 



 


భారత్ నుంచి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ ఆఫ్ స్పిన్నర్ 54 మ్యాచ్‌లలో ఈ ఫీట్ నెలకొల్పాడు. అనిల్ కుంబ్లే(66), హర్భజన్ సింగ్ (72), కపిల్ దేవ్ (83) మరియు జహీర్ ఖాన్ (89) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.  


Also Read: India vs England 1st Test Day 3: నాటకీయంగా ఔటైన Cheteshwar Pujara, మూడో రోజూ England జట్టుదే ఆధిపత్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook