India vs England: వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం, తొలి ఇన్నింగ్స్‌‌లో 337 పరుగులకు Team India ఆలౌట్

India vs England 1st Test Live Score Updates: పర్యాటక జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లాండ్‌కు 241 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 10, 2021, 02:27 PM IST
India vs England: వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం, తొలి ఇన్నింగ్స్‌‌లో 337 పరుగులకు Team India ఆలౌట్

India vs England 1st Test Live Score: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 257/6తో సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలుత రవిచంద్రన్ అశ్విన్ వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ (85 నాటౌట్; 138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటానికి తోడు లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 337 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లాండ్‌కు 241 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 

ఇంగ్లాండ్ బౌలర్ లీచ్ వేసిన బంతిని అశ్విన్‌(31) డిఫెన్స్ ఆడబోతే గ్లోవ్స్‌కు తాకి అక్కడే లేచించి. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న బెన్ స్టోక్స్ అందుకునే యత్నం చేయగా, అంతలోనే ఇంగ్లాండ్ కీపర్ జాస్ బట్లర్ డైవ్ చేసి చక్కని క్యాచ్ అందుకోవడంతో టీమిండియా(Team India) ఆల్ రౌండర్ అశ్విన్ నిరాశగా వెనుదిరిగాడు. దీంతో వాషింగ్టన్ సుందర్, అశ్విన్ 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై లీచ్ టీమిండియాను మరోదెబ్బ కొట్టాడు. షాబాద్ నదీమ్(0)ను డకౌట్ చేశాడు.

Also Read: India vs England 1st Test Day 3: నాటకీయంగా ఔటైన Cheteshwar Pujara, మూడో రోజూ England జట్టుదే ఆధిపత్యం

 

ఫినిషింగ్ ఇచ్చిన అండర్సన్..
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టీమిండియా చివరి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత 94వ ఓవర్‌లో 5వ బంతికి ఇషాంత్ శర్మను పెవిలియన్ బాట పట్టించాడు. ఇషాంత్ ఆడిన బంతిని ఓలీ పోప్ క్యాచ్ పట్టడంతో విరాట్ కోహ్లీ(Virat Kohli) సేన 9వ వికెట్ కోల్పోయింది. తన మరుసటి ఓవర్‌లో జస్ప్రిత్ బుమ్రాను ఔట్ చేయగానే 337 పరుగులకు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్‌ నాలుగు వికెట్లు సాధించగా, అండర్సన్‌, ఆర్చర్‌, లీచ్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News