Virat Kohli Covid-19: షాకింగ్ న్యూస్.. విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్! భారత్, ఇంగ్లండ్ టెస్ట్ జరిగేనా?
Virat Kohli tested positive for Coronavirus. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్‌గా వార్తలు వస్తున్నాయి.
Virat Kohli tested positive for Coronavirus: ఇంగ్లండ్‌లో భారత పర్యటన ప్రారంభంకాకముందే సమస్యలు మొదలయ్యాయి. భారత ఆటగాళ్లను కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా కారణంగా భారత జట్టుతో పాటు లండన్ విమానం ఎక్కని విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ముగిసియాన దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లాడు. మాల్దీవ్స్‌లో హాలీడేస్ బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక అతనికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఓ జాతీయ పత్రికా తమ కథనంలో వెల్లడించింది. అయితే కోహ్లీకి పాజిటివ్ అన్న విషయం బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కోహ్లీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఇంగ్లండ్ టూర్ కోసం విరాట్ కోహ్లీ ఇప్పటికే యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల కోహ్లీ భారత ఆటగాళ్లతో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. ప్రాక్టీస్ సందర్భంగా మిగతా ఆటగాళ్లతో కూడా క్లోజ్ కాంటాక్ట్ అయ్యాడు. విరాట్ ఇపుడు కోవిడ్ బారిన పడ్డాడన్న వార్త నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌పై పలు సందేహాలు నెలకొన్నాయి. కోవిడ్ కారణంగా గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్.. ఇంగ్లండ్‌కు వెళ్ళింది. షెడ్యూల్ ప్రకారం జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం అవ్వాలి.
గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో విరాట్ కోహ్లీ 7 ఇన్నింగ్స్‌ల్లో 31.14 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే బాదాడు. ఆ సిరీస్ సమయంలో కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్. ప్రస్తుతం మాత్రం జట్టులో ఓ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు రోహిత్ శర్మ సారథిగా ఉన్నాడు.
Also Read: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
Also Read: Cinema Shootings Bundh: తెలుగు సినిమాలకే కాదు.. ఇతర భాషల సినిమాలకూ తప్పలేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.