Ranchi Test Live Updates: రాంచీ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు 302/7తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మరో 51 పరుగులు మాత్రమే జోడించి వికెట్లన్నీ కోల్పోయింది. చివరి మూడు వికెట్లను రవీంద్ర జడేజా తీశారు.  ఇంగ్లండ్ బ్యాట‌ర్ జో రూట్ 122 పరుగులతో నిలిచాడు. రెండో రోజు ఆట మెుదలుపెట్టిన జడేజా కేవలం ఆరుగురు పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లను చేజార్చుకుంది. రాబిన్సన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివరి ఇద్దరి బ్యాటర్లు డకౌట్ అయ్యారు.  టీమిండియా బౌలర్లలో స్పిన‌ర్ జ‌డేజా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రెండు పరుగులకే ఔటయ్యాడు. మరోవైపు డబల్ సెంచరీ హీరో యశస్వి మాత్రం తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తగ్గేదే లే అంటూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. ఇంకా భారత్ 285 పరుగులు వెనుకబడి ఉంది. యశస్వి 40 పరుగులతో, గిల్ 25 పరుగులతో ఆడుతున్నారు. రోహిత్ వికెట్ ను అండర్సన్ తీశాడు. 


Also Read: Karnataka Cricketer: ఇండియన్ క్రికెట్ లో విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి..


Also Read: IND vs ENG 4th Test: సెంచరీతో ఆదుకున్న రూట్.. తొలి రోజు ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter