India vs England: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం టీమిండియా పర్యటన ఇంగ్లాండ్‌లో కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు అక్కడి పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా తమ భార్య, పిల్లలతో కాలక్షేపం చేస్తోంది టీమిండియా. డబ్ల్యూటీసీ సమయంలో ఆటగాళ్లతో పాటు కుటుంబానికి సైతం బీసీసీఐ అనుమతి ఇవ్వడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువ ఓపెనింగ్ సంచలనం శుబ్‌మన్‌గిల్ గాయమైందని, సిరీస్ ప్రారంభానికి ముందే అందుకు సంబంధించి అతడికి శస్త్రచికిత్స అవసరమని సమాచారం. మరోవైపు ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల కీలకమైన సిరీస్ ప్రారంభం కానుంది. అంతర్గతంగా గాయం కావడంతో ఇది త్వరగా గుర్తించి చికిత్సకు వెళ్లలేదని తెలుస్తోంది. బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడారు. టీమిండియా (Team India) ఓపెనర్ శుబ్‌మన్ గిల్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. మరో నెల వరకు సమయం ఉన్నా పరిస్థితి అనుకూలిస్తుందని మాత్రం చెప్పలేం. గాయం పెద్దదేనని సమాచారం అందినట్లు వెల్లడించారు. 


Also Read: Kane Williamson: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్ లేపిన కేన్ విలియమ్సన్


గిల్‌కు ఏ సమయంలో గాయమైందో తెలియదు. కానీ పిజియో నితిన్ పాటిల్ అతడి పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరీశీలిస్తున్నాడని చెప్పారు. అయితే కీలకమైన సిరీస్, అందులోనూ టెస్టులు కావడంతో పంజాబ్ యువ ఆటగాడు కచ్చితంగా సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లలో గిల్ ఒకడు. కానీ గత నాలుగైదు ఇన్నింగ్స్‌లలో కనీసం హాఫ్ సెంచరీ సైతం నమోదుచేయలేకపోయాడు. 


న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC Final)లో సైతం రెండు ఇన్నింగ్స్‌లలో గిల్ నిరాశపరిచాడు. ఒకవేళ టెస్ట్ సిరీస్‌కు గిల్ దూరమైతే, అతడి స్థానాన్ని మయాంక్ అగర్వాల్ లేదా కేఎల్ రాహుల్‌లలో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనకు స్టాండ్ బై ఆటగాడిగా వెళ్లిన అభిమన్యు ఈశ్వరన్‌కు చోటు దక్కడం కష్టమే. ఇంగ్లాండ్ గడ్డపై రాణించి సిరీస్ నెగ్గాలని విరాట్ కోహ్లీ సేన భావిస్తోంది.


Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook