IND vs NZ 1st Test: మయాంక్ విఫలమయినా.. చెలరేగిన గిల్! లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?
భారత్ Vs న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్ నిరాశపరిచాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఒక వికెట్ కోల్పయి 82 పరుగులు చేసింది.
India vs New Zealand 1st Test Day 1: రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు భోజన విరామ సమయానికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి రహానే సేన 82 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (13) విఫలమయినా.. యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.
87 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. చేతేశ్వర్ పుజారా (15) అండతో గిల్ అద్భుతంగా ఆడి భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. పుజారా మాత్రం తనదైన శైలిలో నెమ్మదిగా ఆడాడు. కివీస్ పేసర్ కైల్ జెమీసన్ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: Singer Harini : సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం, అనుమానస్పద స్థితిలో తండ్రి మృతదేహం లభ్యం
కాన్పూర్‌లో ఈరోజు ఉదయం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. రెండు బౌండరీలు బాది మంచి ఊపుమీదున్న అగర్వాల్.. కైల్ జెమీసన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కీపర్ టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 221 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో చేతేశ్వర్ పుజారాతో కలిసి గిల్ జట్టును ఆదుకున్నాడు. చెత్త బంతులకు మాత్రమే పరుగులు చేస్తూ.. భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు.
ఒక వైపు శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడుతుంటే.. మరోవైపు చేతేశ్వర్ పుజారా మాత్రం నెమ్మదిగా ఆడాడు. బౌండరీలు పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. గిల్ బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలోనే 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సోమర్ విల్లె వేసిన 26.3వ ఓవర్‌కు సింగల్ తీసి.. టెస్టుల్లో నాలగవ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Also Read: Father rapes Daughter: కన్నకూతురినే గర్భవతి చేసిన తండ్రి..ఆ విషయం తల్లికి తెలిసి...
ఇద్దరూ ఇప్పటివరకు 127 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక భోజన విరామ సమయానికి భారత్ 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 రన్స్ చేసింది. గిల్ 52, పుజారా 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ పేసర్ కైల్ జెమీసన్ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో సెషన్‌లో కూడాఈ జోడి పరుగులు చేస్తే.. భారత్ సునాయాసంగా 150 రన్స్ మార్క్ అందుకునే అవకాశం ఉంది. టెస్టుల్లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయని గిల్.. ఈ రోజు మూడంకెల డిజిట్ అందుకుంటాడా లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి