India vs New Zealand 3rd ODI Highlights: క్రైస్ట్‌చర్చ్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి వన్డే కూడా వర్షార్ఫణమైంది. దీంతో కివీస్ 1-0 తేడాతో సిరీస్‌ను ఛేజిక్కించుకుంది. మొదటి వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మూడో వన్డేపై కూడా వరుణుడు ప్రతాపం చూపించడంతో మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయస్ అయ్యర్ (49), వాషింగ్టన్ సుందర్ (51) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో మిల్నే, మిచెల్ తలో మూడు వికెట్లు తీయగా.. సౌథీ 2, ఫెర్గ్యూసన్, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18 ఓవర్లలో 104 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫిన్ అలెన్ (57) పరుగులు చేయగా.. కాన్వే (38) నాటౌట్‌గా మిగిలాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను కివీస్‌ బౌలర్లు బాగా ఇబ్బంది పెట్టారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (28), శుభ్‌మన్ గిల్ (13) విఫలమవ్వగా.. రిషబ్ పంత్ (10) చెత్త ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (6) కూడా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 49) జట్టును ఆదుకోగా.. ఒక పరుగు దూరంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీపక్ హుడా (12), దీపక్ చాహర్ (12) కూడా  ఆశించిన మేర రాణించలేకపోయారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (64 బంతుల్లో 51, 5 ఫోర్లు, ఒక సిక్స్‌) మెరవడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు చేసింది. చివరికి 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. 


220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఫిన్ అలెన్ (57) దూకుడుగా ఆడగా.. కాన్వే (38) మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలెన్‌ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. 18 ఓవర్లలో 104 చేసిన సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 


వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి డెవాన్ కాన్వే 38 పరుగులతో క్రీజ్‌లో ఉండగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఖాతా తెరవలేదు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ జట్టు భారత్ కంటే 50 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే మ్యాచ్ పూర్తి ఫలితాన్ని ప్రకటించాలంటే రెండు జట్లు కచ్చితంగా 20 ఓవర్లు ఆడాలి. కివీస్‌ ఇన్నింగ్స్‌కు 18 ఓవర్లే సాధ్యం కావడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. టామ్ లాథమ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌ అవార్డు దక్కింది. 


Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ బాడీ మసాజ్ వీడియో వైరల్.. ఆడుకుంటున్న నెటిజన్లు  


Also Read: China-America: భారత్‌తో సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook