సిరీస్ గెలిచే లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్!
India vs NZ: న్యూజిలాండ్‌తో నేడు టీమ్ ఇండియా రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి సిరీస్ ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తోంది.
Ind vs NZ: 2nd T20 preview: ఇండియా-న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది టీమ్ ఇండియా. రెండో మ్యాచ్‌నూ గెలిచి.. సిరీస్‌ను (India vs NZ 2nd T20) కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు కివీస్ జట్టు.. కూడా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో విజయం కోసం వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో పరాబావం ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టు.. భారత్‌తో తొలి మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. దీనితో రెండో మ్యాచ్‌లో గెలిచి తీరాలని కసితో ఉంది కివీస్ టీమ్.
టీమ్ ఇండియా బలాలు, బలహీనతలు..
రోహీత్ శర్మ కెప్టెన్‌గా(Rohit Sharma), రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా (Rahul Dravid) నియమితులైన తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా (Team India) విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో పలు లోపాలు బయటపడ్డాయి.
Also read: మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్.. డేవిడ్ వార్నర్‌కే ఎందుకిచ్చారంటే?
ముఖ్యంగా బౌలిలంగ్లో వైఫల్యం కనిపించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు ముందు మ్యాచ్‌ను పరిశీలిస్తే.. కివీస్ జట్టు 13 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఆ సమయంలో స్కోరు 106గా ఉంది. వికెట్లు పడకపోవడం, స్కోరు భారీగా పెరుగుతుండటం వంటివి కాస్త ఆందోళన కలిగించాయి. ఎట్టకేలకు రవిచంద్రన్ అశ్విన్ చాప్మన్, పిలిప్స్లను ఔట్ చేశాక కివీస్ జట్టును కాస్త అదుపు చేయగలిగింది టీమ్ ఇండియా.
బౌలింగ్‌లో అశ్విన్, భువనేశ్వర్ తప్ప.. సిరాజ్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ అంతగా రాణించలేకపోయారు. గాయం కారణంగా సిరాజ్ స్థానంలో నేటి మ్యాచ్‌లో మరొకరికి స్థానం దక్కే అవకాశముంది. అయితే పరుగుల విషయంలో కివీస్‌ను కట్టడి చేసేందుకు బౌలర్లు కృషి చేయాలని చెబుతున్నారు విశ్లేషకులు.
బ్యాంటింగ్ పరంగా చూస్తే.. మిడిలార్డర్ బ్యాటర్లు జట్టుకు చేయుతనివ్వాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో దిగిన శ్రేయాస్ అయ్యర్ తడబడ్డాడు. రిషబ్ పంత్ కాస్త పర్వాలేదని పించినా.. వెంకటేశ్ అయ్యర్ రెండు బంతులకే ఔటవ్వడం ఆందోళన కలిగించింది. అందుకే ఈ మ్యాచ్‌లో వారికి అవకాశమిస్తే.. మెరుగైన ప్రదర్శన కనబర్చాలని అంటున్నారు విశ్లేషకులు.
Also read: న్యూజిలాండ్ తో మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదని తెలిసింది: రోహిత్ శర్మ
కివీస్‌కు కీలక మ్యాచ్..
కివీస్‌కు సిరిస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ టీమ్ (NZ team).. బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్‌లో పవర్ ప్లేలో టీమ్ ఇండియా ప్లేయర్స్‌ను కట్టడి చేయడంలో విఫలమైనందున.. ఈ సారి ఆ లోపాలను సరిచేసుకుంటూ ముందుగా సాగాలని భావిస్తోంది.
ఒకవేళ నేటి మ్యాచ్‌లోను కివీస్ జట్టు ఓడిపోతే సిరీస్ భారత్ కైవసం అవుతుంది. దీనితో ఈ నెల 21న జరిగే చివరి టీ20 మ్యాచ్ నామమాత్రం కానుంది. నేడు సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఝార్ఖండ్ లోని రాంచీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Also read: ఇండియా, న్యూజిలాండ్ టీ20 మ్యాచును వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిల్
Also read: మహ్మద్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook