India Vs New Zealand 2nd Odi Updates: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్ వేదికగా రెండో మ్యాచ్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా ప్రస్తుతం సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌ ఓడితే సిరీస్ న్యూజిలాండ్ వశం అవుతుంది. కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. కివీస్‌ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఆడమ్ మిల్నే స్థానంలో మిచెల్ బ్రేస్‌వెల్ జట్టులోకి వచ్చాడు. టీమిండియా రెండు మార్పులతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హుడా జట్టులోకి రాగా.. శార్ధుల్ ఠాకూర్ ప్లేస్‌లో దీపక్ చాహర్ ఎంట్రీ ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వికెట్‌లో తేమ ఉన్నందున మేము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. లాస్ట్ మ్యాచ్‌లో కూడా మొదటి 10-15 ఓవర్లకు వికెట్ సీమింగ్‌లో ఉంది. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. సంజూ శాంసన్, శార్ధుల్ ఠాకూర్ స్థానంలో దీపక్ హుడా, దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌లో మేము బాగానే ఆడాం. మాకు కేవలం 10 శాతం ఇంప్రూవ్‌మెంట్ కావాలి. ఇదే చాలా తేడాను చూపిస్తుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఇంకా బాగా రాణించాల్సిన అవసరం ఉంది. మేము కొంచెం తెలివిగా ఆడాలి..' అని కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు.


ఇక సంజూ శాంసన్‌ను ఒక్క మ్యాచ్‌కే బెంచ్‌కు పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీ20 సిరీస్‌కు పక్కనబెట్టినప్పుడే ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఫస్ట్ వన్డేలో శాంసన్‌కు అవకాశం ఇవ్వగా.. 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇదేం తుది జట్టులో నుంచి తప్పించే అంత ఘోర ప్రదర్శన ఏమి కాదు. అయినా ఈ యంగ్ క్రికెటర్‌పై ఒక్క మ్యాచ్‌కే వేటు పడింది.


అదేసమయంలో వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌కు మాత్రం ఏఢోకా లేకుండా జట్టులో స్థానం లభిస్తోంది. పంత్‌కు ఇచ్చిన అవకాశాల్లో పావు వంతు కూడా శాంసన్‌కు ఇవ్వలేదు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే పక్కన కూర్చొబెట్టడం.. మళ్లీ దేశవాలీ, ఐపీఎల్‌లో రాణించి జట్టులోకి రావడం వెళ్లిపోవడం శాంసన్‌కు షరా మాములే అయిపోయింది. 


ఐపీఎల్ 2022లో కూడా సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. 450పైగా పరుగులు చేసిన సంజూ.. కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అయినా టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు లభించలేదు. వికెట్ కీపర్లుగా దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ కార్తీక్, పంత్ ఇద్దరూ విఫలమయ్యారు.


ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కోసం శాంసన్ తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. కానీ అతనికి టీ20 సిరీస్‌లో ప్లే-11లో అవకాశం రాలేదు. ఓపెనర్‌గా వచ్చిన పంత్.. రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 17 పరుగులు చేశాడు. ఇక వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో పంత్, శాంసన్ ఇద్దరు ఆడారు. అయితే పంత్ 15 పరుగులకే ఔట్ అయి మళ్లీ నిరాశపర్చగా.. శాంసన్ 38 రన్స్ చేసి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. టీ20, మొదటి వన్డే మ్యాచ్‌లో విఫలమైనా పంత్‌కు మళ్లీ అవకాశం ఇవ్వగా.. శాంసన్‌ను ఒక్క మ్యాచ్‌కే బెంచ్‌పై కూర్చొబెట్టడం ఏంటని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో టీమ్ మేనేజ్‌మెంట్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.


Also Read: రెండో వన్డేకు వరుణుడి అంతరాయం... ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?


Also Read: Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి కోటంరెడ్డి ఇంటికి పోలీసులు.. వాగ్వాదం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook