IND vs NZ: రెండో వన్డేకు వరుణుడి అంతరాయం... ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?

India vs New Zealand:  కివీస్‌తో రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 07:58 AM IST
  • రెండో వన్డేకు వర్షం అంతరాయం
  • దీపక్ హుడా, దీపక్ చాహర్‌లకు చోటు
  • సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌లకు ఉద్వాసన
IND vs NZ: రెండో వన్డేకు వరుణుడి అంతరాయం... ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?

India vs New Zealand,  2nd ODI Live: భారత్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్ 2 పరుగులు, శుభమన్ గిల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తొలి మ్యాచ్ లో భారత్ ఓడటంతో ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కివీస్ తో టీమిండియా హామిల్టన్‌ వేదికగా రెండో వన్డేలో తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం పడటంతో మ్యాచ్ ను ఆపేశారు. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌ ప్లేస్ లో దీపక్ హుడా, దీపక్ చాహర్‌లను జట్టులోకి తీసుకొచ్చారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు అంత సులువేమీ కాదు. బ్యాటింగ్ బలంగా ఉన్న టీమిండియా.. బౌలింగ్ లో తేలిపోయింది. మరి ఈ మ్యాచ్ ద్వారానైనా భారత్ బౌలర్లు గాడినపడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. 

భారత్ తుది జట్టు: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్, చాహల్‌.
న్యూజిలాండ్‌ తుది జట్టు: ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్‌ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, ఫెర్గూసన్.

Also read: FIFA WC 2022: అద్భుత విజయానికి ఊహించని నజరానా, సౌదీ ఆటగాళ్లకు రోల్స్ రాయిస్ కార్లు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News