Ind Vs Nz T20: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 కూడా రద్దు..!
Ind Vs Nz Weather Update: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. ఇండియా-కివీస్ జట్ల మ్యాచ్‌లకు వరుణుడు పగ పట్టాడు. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. ఇప్పుడు రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది.
Ind Vs Nz Weather Update: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ మైదానంలో మరికొన్ని గంటల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్ టాస్ లేకుండానే వర్షంలో కొట్టుకుపోయింది. దీంతో బే ఓవల్ మైదానంలో జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం వల్ల రద్ద అయ్యే అవకాశం ఉంది.
మ్యాచ్‌ని వీక్షించేందుకు బే ఓవల్ మైదానానికి చేరుకుంటున్న క్రికెట్ ప్రేమికులతో పాటు రెండు జట్ల అభిమానులు కూడా వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఆదివారం మౌంట్ మౌంట్‌గుయ్‌లో 90 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 24 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని నివేదికలో పేర్కొన్నారు. అదేసమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 19 డిగ్రీలు, కనిష్టంగా 15 డిగ్రీల వరకు ఉండవచ్చు. అంటే వర్షం మళ్లీ మ్యాచ్‌కు వరుణుడు మరోసారి విలన్‌గా మారే ఛాన్స్ ఉంది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. వెల్లింగ్‌టన్‌లో వర్షం ఆగడకుండా వర్షం కురవడంతో అధికారులు బంతి వేయకుండానే రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్‌కి టాస్ కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇరు జట్లు మౌంట్ మౌంగనుయ్ చేరుకున్నాయి. ఇక్కడ కూడా వరుణుడు మరోసారి ప్రతాపం చూపించే అవకాశం ఉండడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ప్రతికూల వాతావరణం కారణంగా రెండో టీ20 మ్యాచ్ రద్దైతే.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారనుంది. మూడో టీ20లో గెలిచే జట్టుకే ట్రోఫీ దక్కనుంది. ఇటీవల భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లోనే వెనుతిరిగాయి. భారత్‌ను ఇంగ్లండ్ ఓడించగా.. పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.
సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి
న్యూజిలాండ్ టూర్ నుంచి చాలా మంది భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, ఓపెనర్ కేఎల్ రాహుల్ సహా పలువురు ఆటగాళ్లు ఈ టూర్‌లో భాగం కావడం లేదు. టీమిండియా కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు దక్కింది. అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న శుభ్‌మన్ గిల్ కూడా జట్టులో ఉన్నాడు. కానీ వరుణుడే కరుణించడం లేదు.
Also Read: Ram Gopal Varma: డేంజరస్ మూవీతో వస్తున్న ఆర్జీవీ.. ట్రైలర్ రిలీజ్
Also Read: Manika Batra: చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. ఆసియా కప్‌లో తొలి మెడల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook