India Vs Pakistan Match Promo: టీ20 ప్రపంచకప్‌-2021(T20 World Cup 2021)లో భాగంగా... భారత్-పాక్‌ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఐసీసీ(ICC) ఇవాళ ట్విటర్‌(Twitter) వేదికగా పంచుకుంది. ఈ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ వీడియోను ప్రత్యేకంగా రూపొందించింది. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)ను షేక్‌ చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: India vs Pakistan T20 World Cup Match: పాక్‌తో తొలిపోరు నేడే, టీమ్ ఇండియా తుది జట్టు ఇదే


'టుడే ఈజ్‌ బిగ్‌ డే' అనే టైటిల్‌తో మొదలయ్యే ఈ వీడియో.. ఇండియా(India), పాకిస్థాన్‌, రైవల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలతో రూపొందించబడి, 'ద వరల్డ్ ఈజ్ వాచింగ్ యు' అనే టైటిల్‌తో ముగుస్తుంది. గతంలో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన  క్లిప్పింగ్స్‌తో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు, అభిమానుల కోలాహలంతో రూపొందించిన ఈ ప్రోమో(India Vs Pakistan Match Promo) వీడియో చూస్తున్నంత సేపు సగటు క్రికెట్‌ అభిమాని రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook