Shadab Khan wants Virat Kohli scores century in Asia Cup 2022: ఆసియా కప్‌ 2022 నేడు ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్‌ 2022 మరికొన్ని రోజుల్లో ఆరంభం కానుంది. ఈ రెండు టోర్నీలు భారత్ గెలవాలంటే.. మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్‌ అందుకోవాల్సిందే. గత మూడేళ్లుగా విరాట్ తన స్థాయి ప్రదర్శన చెయ్యట్లేదు. అడపాదడపా ఇన్నింగ్స్‌లు తప్పితే.. ఒక్క సెంచరీ చేయలేదు. కింగ్ కోహ్లీ సెంచరీ చేసి ఇటీవలే 1000 రోజులు కూడా పూర్తయ్యాయి. దాంతో కోహ్లీ ఫామ్‌పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. విరాట్ సెంచరీ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు మాత్రమే కాదు ఇతర జట్ల ప్లేయర్స్ కూడా కోరుకుంటున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా విరాట్ సెంచరీ చేయాలని ఆ దేవుడిని ప్రార్ధించాడట. అయితే కోహ్లీ పాక్ జట్టుపై మాత్రం చేయకూడని అతడు అంటున్నాడు. ఆసియా కప్ 2022 నేడు ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జరిగే రెండో మ్యాచులో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 


భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. విరాట్ కోహ్లీ ఇకపై బౌలర్లలో భయాన్ని కలిగించడు అనే వ్యాఖ్య నిజమేనా అని అడగ్గా.. షాదాబ్ స్పందిస్తూ మాజీ క్రికెటర్లు ఇకపై ఆడనందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 'విరాట్ లెజెండ్. అతను ఇప్పటికే చాలా ఆడాడు. కోహ్లీ చాలా పెద్ద ఆటగాడు. కోహ్లీ సెంచరీ చేయాలని నేను కోరుకుంటున్నా. అయితే మా జట్టుపై మాత్రం చేయకూడదని నేను కోరుకుంటున్నా' అని అన్నాడు. 


'ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ప్లేయర్‌కూ కేరీర్‌లో ఎప్పుడో ఒకప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుతం కోహ్లీ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోన్నాడు. ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ పరుగుల కొరతను తీర్చుకోవాలని ఆశిస్తున్నా. కోహ్లీ ఫామ్ కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తా. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ సెంచరీ చేయాలని అతడి అభిమానిగా కోరుకుంటున్నా' అని షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. 


Also Read: తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ ఢీ.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్, తుది జట్లు ఇవే!


Also Read: Oppo K10 Smartphone: రూ.14990 విలువ చేసే ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.599కే... ఆఫర్ రేపటితో లాస్ట్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook