IND vs PAK T20 Asia Cup 2022: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైఓల్టేజ్ మూమెంట్. మ్యాచ్ జరిగినంతసేపు క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. గెలిస్తే వీధుల్లోకి వచ్చి సంబరాలు.. ఓడితే క్రికెటర్లపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తడం కామన్. ఆసియా కప్‌లో భాగంగా నేడు ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దాయాదుల మధ్య జరిగే ఈ టీ20 క్రికెట్ ఫైట్‌ను వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఏ సమయంలో, ఏ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందంటే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ టీవీ ఛానెల్, ఆ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ :


ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ టీ20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రాత్రి 7.30గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. అదే సమయానికి డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీలోనూ లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌లో పీటీవీలో, బంగ్లాదేశ్‌లో గాజీ టీవీలో, ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్‌లో, యూఎస్‌లో విల్లో టీవీలో, యూకెలో స్కై స్పోర్ట్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.


నేటి టీ20 మ్యాచ్‌లో తుది జట్ల అంచనా :


ఇండియా తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, యజువేంద్ర చాహల్


పాకిస్తాన్ తుది జట్టు (అంచనా) : బాబర్ అజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఖుష్‌దిల్ షా, హైదర్ అలీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హారీస్ రౌఫ్, నజీమ్ ఖాన్, ఉస్మాన్ ఖాదీర్, షానవాజ్ దహని


ఇండియా-పాకిస్తాన్ ఇప్పటివరకూ 9 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో ఇండియా గెలవగా కేవలం రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలిచింది. చివరిసారిగా అక్టోబర్ 2021లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అందులో పాకిస్తాన్‌నే విజయం వరించింది. తాజా మ్యాచ్‌కు ఇండియా బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తోంది. అటు పాకిస్తాన్ టాపార్డర్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మరికొద్ది గంటల్లో ఈ రెండు జట్లు మైదానంలో తలపడనున్నాయి. మొత్తంగా ఇవాళ జరిగే ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.


Also Read: Horoscope Today August 28th 2022: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..   


Also Read: Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత నేడే.. 9 సెకన్లలో నేలమట్టం.. ఎలా కూల్చనున్నారు.. అసలెందుకు కూలుస్తున్నారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook