Ind Vs Pak World Cup 2023 Latest Updates: అహ్మదాబాద్‌లో అభిమానుల కోలహాలం, కేరింతల నడుమ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత బౌలర్లు ఇబ్బంది పెడుతున్నారు. అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఆరంభంలో వీరిద్దరూ వేగంగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాలని చూశారు. 8 ఓవర్లలో తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఆరంభంలో వికెట్ తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాక్ ఓపెనర్లు అవకాశం ఇవ్వలేదు. అయితే 8వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వేసిన సూపర్ స్కెచ్‌కు ఫలితం దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన బంతిని పేసర్ మహ్మద్ సిరాజ్ చేతికి అందించాడు హిట్‌మ్యాన్. ఈ ఓవర్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు. తొలి 5 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. 5వ బంతి తర్వాత సిరాజ్.. కెప్టెన్ రోహిత్ మధ్య మరో సంభాషణ జరిగింది. అనంతరం ఫీల్డింగ్‌లో కొన్ని మార్పుల గురించి చర్చిస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఫైన్ లెగ్ ఫీల్డర్‌ను కొంచెం కదిలించేలా చేశారు. దీంతో కాస్త ఒత్తిడికి గురైన పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. ఫైన్‌ లెగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి మిస్ అవ్వడంతో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. షఫీక్ 24 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. షఫీక్ గత శ్రీలంకపై 113 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మ, కోహ్లీ వేసిన ఉచ్చులో చిక్కిపోయి త్వరగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. 


ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ విలవిలాడుతున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్ (50), మహ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36) రాణించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 


Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి