Ind vs SA 2nd ODI Prediction: సఫారీల గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండవ విజయం కోసం టీమ్ ఇండియా, తొలి మ్యాచ్‌లో ఓటమి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రోటీస్ జట్టు సిద్ధమయ్యాయి. తొలి వన్డేలో వీర విహారం చేసిన టీమ్ ఇండియా పేసర్లపైనే అందరి దృష్టీ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియా దక్షిణాఫ్రికా మధ్య సఫారీల గడ్డపై జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి 1-0 ఆధిక్యంతో ఉంది. ఇవాళ పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనున్న రెండవ వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. గత ఏడాది కూడా కేఎల్ రాహుల్ నేతృత్వంలో సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు వన్డే సిరీస్‌లో 0-3 పరాభవం ఎదురైంది. ఇప్పుడా ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రాహుల్ సేన సిద్ధమైంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రికా రెండవ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. 


మొదటి వన్డేలో తలపడిన జట్టుతోనే టీమ్ ఇండియా సిద్ధం కావల్సి ఉండగా శ్రేయస్ అయ్యర్ టెస్ట్ సిరీస్ సన్నద్ధతకై విశ్రాంతి తీసుకునేందుకు తప్పుకున్నాడు. దాంతో బ్యాటింగ్ విభాగంలో ఓ ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఎంపీకు చెందిన రజత్ పాటిదార్‌కు అవకాశం లభించవచ్చు. ఈ స్థానం కోసం రింకూ సింగ్ వర్సెస్ రజత్ పాటిదార్ మధ్య పోటీ ఉంది. మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరుకు ఆలవుట్ కావడంతో భారత బ్యాటర్లకు పెద్దగా అవకాశం లభించలేదు. రెండవ వన్డేలో ఏం చేస్తారో చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెండవ మ్యాచ్‌లో ఎలా కోలుకుని ఆడతారో చూడాలి.


ఇవాళ మ్యాచ్ జరగనున్న పిచ్ అత్యంత స్లో పిచ్. భారీ స్కోర్లకు ఏ మాత్రం అవకాశం లేదు. గత 12 ఏళ్లలో 8 వన్డేలు జరిగితే ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా 300 స్కోర్ దాటలేదు. వర్షసూచన లేదు గానీ వాతావరణంలో తేమ ఉంది. ఇది స్పిన్నర్లకు అనుకూలించవచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారముంటుంది. దాంతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో మ్యాచ్ ప్రత్యక్షంగా చూడవచ్చు.


టీమ్ ఇండియా ప్లేయింగ్ 11


కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కమార్, రింకూ సింగ్ లేదా రజత్ పాటిదార్


దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11


రీజా హెండ్రిక్స్, టోనీ డీ జోర్జి, రస్సీ వాండెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, యాండైల్ ఫెలుక్వాయో,కేశవ్ మహారాజ్, బర్గర్, తబ్రేజ్ షమ్సి


Also read: Tamilnadu Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు, రంగంలో దిగిన వైమానిక బృందాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook