IND vs SA 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సిరాజ్, సూర్యకు నిరాశే! టీమిండియాకు చావోరేవో!!
IND vs SA 2nd ODI Toss: పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న రెండో వన్డే మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India vs South Africa 2nd ODI Playing XI is Out:: మూడు వన్డేల సిరీసులో భాగంగా బొలాండ్ పార్క్ మైదానం పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ (IND vs SA) జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ (Toss) గెలిచిన టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సిసంద మగల (Sisanda Magala) జట్టులోకి వచ్చాడు.
తొలి వన్డేలో ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer)ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా.. రెండో వన్డేలో అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది టీమిండియా మేనేజ్మెంట్. మరోవైపు తొలి మ్యాచులో భారిగా పరుగులు సమర్పించుకున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై కూడా నమ్మకం ఉంచింది. దాంతో జట్టులో చోటు ఆశించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)లకు నిరాశే ఎదురైంది.
Also Read: Nani - Chiranjeevi: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఇంటికి పిలిచి మరీ ఇచ్చేశాడుగా!!
తొలి వన్డేలో ఓడిన భారత్.. రెండో వన్డేలో కూడా ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఇది చావోరేవో అని చెప్పాలి. ఈ మ్యాచ్ నెగ్గాలంటే భారత బ్యాటర్లు భారీ స్కోరు చేయాల్సి ఉంది. మొదటి మ్యాచ్ గెలిచి జోరుమీదున్న దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించాలంటే టీమిండియా.. అన్ని విభాగాల్లోనూ పుంజుకోవాల్సిందే. అంతేకాదు కేఎల్ రాహుల్ (KL Rahul) నాయకత్వం కూడా మెరుగుపడాల్సి ఉంది.
తుది జట్లు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జననేమన్ మలన్, తెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్‌క్రమ్, రాస్సీ వాన్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెలుక్వాయో, సిసంద మగల, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి, తబ్రైజ్ షంసీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook