IND vs SA 3rd ODI: కేప్‌టౌన్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో టీమ్ఇండియాపై సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) హాఫ్ సెంచరీలు సాధించినా ఓటమి తప్పలేదు. సూర్యకుమార్‌ యాదవ్ (39), శ్రేయస్‌ అయ్యర్ (26) రాణించారు. 



ఆఖర్లో దీపక్‌ చాహర్, బుమ్రా (12) విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు. మిగతా వారిలో కేఎల్‌ రాహుల్ 9, పంత్ డకౌట్, జయంత్ యాదవ్ 2, చాహల్ 2, ప్రసిధ్‌ కృష్ణ 2* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, పెహులక్వాయో 3.. ప్రిటోరియస్ 2, మగలా, కేశవ్ మహరాజ్‌ చెరో వికెట్ తీశారు. 


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ డికాక్‌ (130), డస్సెన్ (52) రాణించారు. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. 144 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 


అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోవడం వల్ల భారీ స్కోరు సాధించే అవకాశాన్ని దక్షిణాఫ్రికా చేజార్చుకుంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్‌ (39), ప్రిటోరియస్‌ (20) ధాటిగా ఆడటం వల్ల ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. మిగతా బ్యాటర్లలో మలన్ 1, బవుమా 8, మార్‌క్రమ్ 15, పెహులుక్వాయో 4, మహరాజ్‌ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్‌ 3, బుమ్రా 2, దీపక్‌ చాహర్ 2, చాహల్ ఒక వికెట్‌ పడగొట్టారు.  


Also Read: Cameron Boyce Double Hat-Trick: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌!!


Also Read: IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook