IND vs SA 3rd Test: శతకంతో మెరిసిన పంత్... దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యం!
IND vs SA 3rd Test: మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్‌ఇండియా. పంత్ శతకంతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లులో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
IND vs SA 3rd Test Day 3: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా (Team India) 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (100 నాటౌట్) శతకంతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కి 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి టీమ్ఇండియాకు 211 పరుగుల ఆధిక్యం సాధించినట్లయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (28) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్లలో జాన్సన్ నాలుగు, ఎంగిడి, రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్‌లో 57/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ బౌలింగ్ లో పీటర్సన్ అద్భుత క్యాచ్ పట్టడంతో పుజారా (Pujara) వెనుదిరగాల్సి వచ్చింది. వెనువెంటనే రహానే రబాడకు చిక్కాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి..పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీకి (Virat Kohli) జతకలసిన పంత్ నిలకడగా ఆడాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ..స్కోర్ బోర్డును పరుగులెత్తించారు.
Also Read: Keegan Petersen - Cheteshwar Pujara: పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన పుజారా!!
అనంతరం ప్రోటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యాడు. అనంతరం టెయిలెండర్లు సహాయంతో ఇన్నింగ్స్ కొనసాగించిన పంత్ (Rishabh Pant) వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి దాటించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా...పంత్ ఒంటరి పోరాటం చేశాడు. శతకం సాధించి చివరకు నాటౌట్ గా మిగిలాడు. దీంతో అతిథ్య జట్టు ముందు భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook