India vs South Africa: ఇండియా- దక్షిణాఫ్రికా కీలకమైన, చివరి టెస్ట్ ఇవాళ ప్రారంభం కానుంది. చెరో టెస్టు విజయాలతో సమ ఉజ్జీగా ఉన్న టీమ్ ఇండియా, సౌత్ ఆఫ్రికాలకు ఇది కీలకం. మూడవ టెస్ట్ టీమ్ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ ఇండియా ఈసారైనా టెస్ట్ సిరీస్ గెలుస్తుందా లేదా. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయి. సెంచూరియన్ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తే..జొహాన్నెస్ బర్గ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక కీలకమైన మూడవ టెస్ట్ మ్యాచ్ న్యూలాండ్స్ గ్రౌండ్‌లో ఇవాళ ప్రారంభం కానుంది.  ఈ టెస్ట్‌లో విజయంతో  మరోసారి సిరీస్ దక్కించుకునేందుకు దక్షిణాఫ్రికా, చరిత్ర తిరగరాసేందుకు టీమ్ ఇండియా ప్రయత్నించనున్నాయి.


ఫ్రీడం ట్రోఫీ విజేత ఎవరో తేల్చేందుకు సమయం ఆసన్నమైంది. కీలకమైన మూడవ టెస్ట్ మ్యాచ్ (Third Test) గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు రెండు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. కేప్‌టౌన్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఇవాళ మద్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. రెండవ టెస్ట్ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ..మూడవ టెస్ట్‌లో అడనున్నాడు.


టీమ్ ఇండియా (Team India)


కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛైతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ), ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రా, ఇషాంత్ శర్మ


దక్షిణాఫ్రికా ( South Africa


డీన్ ఎల్గర్ ( కెప్టెన్ ), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్‌డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్ ( వికెట్ కీపర్ ), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, డువాన్ ఒలివియర్


Also read: Novak Djokovic: ఆస్ట్రేలియా కోర్టులో జకోవిచ్ విజయం.. వీసా పునరుద్ధరణ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook