India vs South Africa 4th T20 Highlights: సౌతాఫ్రికాపై నాలుగో టీ20లో టీమిండియా చెలరేగి ఆడింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో సింహనాదం చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 47 బంతుల్లో 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. బంతి పడడమే ఆలస్యం బౌండరీకి తరలించడమే ధ్యేయంగా వీరిద్దరి బ్యాటింగ్ సాగింది. మ్యాచ్‌లో ఎక్కువ బంతులు ఫీలర్డు చేతుల్లో కంటే స్టేడియంలో ప్రేక్షకులకే చిక్కింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 36 పరుగులు చేసి ఆరంభంలో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శర్మ ఔట్ అయిన తరువాత పెనం మీద నుంచి పొయిలో పడ్డట్లు అయింది సఫారీ బౌలర్ల పరిస్థితి. ఏ ఒక్క బౌలర్‌ను వదలకుండా ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే కసితో బ్యాటింగ్ చేశారు. తిలర్ వర్మకు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. సంజూ శాంసన్‌కు ఈ సిరీస్‌లో రెండోది. దక్షిణాఫ్రికా ఫీల్డర్లు చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు జార విడిచి భారీ మూల్యం చెల్లించుకున్నారు. 284 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. అప్పటివరకు కాస్త నెమ్మదిగా ఆడిన సంజూ శాంసన్.. తిలక్ వర్మ క్రీజ్‌లోకి రాకతో గేరు మార్చారు. ఇద్దరు పోటీ పడుతూ సిక్సర్లు బాదారు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా ఉతికి ఆరేశారు. వీరిద్దరు ధాటికి బంతి ఎక్కడ వేయాలో కూడా సఫారీ బౌలర్లకు అర్థం కాలేదు. దీనికి తోడు మధ్యలో ఫీల్డర్లు ఈజీ క్యాచ్‌లు వదిలేయడం భారత్‌కు కలిసి వచ్చింది.


భారీ లక్ష్యంతో బరిలోకి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. హార్థిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. హెండ్రిక్స్ డకౌట్ అవ్వగా.. ర్యాన్ రికెల్టన్ ఒక పరుగు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ 8 పరుగులు చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ డకౌట్ అయ్యాడు.


Also Read:  Smita Sabharwal: మహారాష్ట్రలో స్మిత సబర్వాల్.. అక్కడ కూడా మేడమ్ సర్.. మేడమ్ అంతే.. క్రేజ్ మాములుగా లేదుగా..


Also Read: Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter