India vs South Africa: Virat Kohli says no rift with Rohit Sharma: దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour)కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పలు రూమర్లకు చెక్ పెట్టాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాదానాలు ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్‌ శర్మ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు. దాంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు పులిస్టాప్ పడింది. తనను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ (BCCI) ఇటీవల తప్పించిన తర్వాత తొలిసారిగా విరాట్‌ కోహ్లీ మీడియా సమావేశం (Virat Kohli Press conference)లో పాల్గొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'టీ20 కెప్టెన్సీ నుంచి నేనే స్వయంగా తప్పుకున్నా. ముందుగా బీసీసీఐ అధికారులకు సమాచారం ఇచ్చాను. వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. కెప్టెన్సీ వదిలేయవద్దని నాకు ఎవరూ చెప్పలేదు. ఆపై వన్డే కెప్టెన్సీ మార్పు గురించి నాతో చర్చించలేదు. టెస్ట్ టీమ్ గురించి సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు నాకు సమాచారమిచ్చారు. జట్టు గురించి చీఫ్‌ సెలక్టర్‌ నాతో చర్చించారు. సమావేశం ముగిసే సమయానికి.. నేను ఇకపై వన్డే కెప్టెన్ కాదని ఐదుగురు సెలెక్టర్లు చెప్పారు. జట్టు కోసం శాయశక్తులా శ్రమించాను' అని మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. 


Also Read: స్కూల్ డ్రస్స్ లో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?


'కెప్టెన్‌గా టీమిండియాను సరైన దిశలో నడిపించాననే నేను భావిస్తున్నాను. వ్యూహాత్మకంగా రోహిత్‌ శర్మ (Rohit Sharma) సమర్థవంతమైన నాయకుడు. హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి జట్టుని ముందుకు నడిపిస్తాడనుకుంటున్నాను. టీ20, వన్డే క్రికెట్లో సారథికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను. భారత్ ఎప్పటిలానే విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అని విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పేర్కొన్నాడు. టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే.. వన్డే సారథ్య బాధ్యతలు కూడా అప్పగిస్తూ బీసీసీఐ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం కోహ్లీ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే సారథిగా ఉండనున్నాడు. 


Also Read: Breaking News: వాగులో పడిన ఆర్టీసీ బస్సు- ఐదుగురు ప్రయాణికులు మృతి


'వన్డే కెప్టెన్సీ మార్పు నిర్ణయంను బీసీసీఐ ఎందుకు తీసుకుందో నేను అర్థం చేసుకోగలను. గతంలో చెప్పాను. ఇప్పుడు మరోసారి కూడా చెపుతున్నా. నాకు, రోహిత్‌ శర్మకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. గత రెండు సంవత్సరాలుగా నేను ఇదే విషయాన్ని చెప్పి చెప్పి అలసిపోయాను. ఎన్నిసార్లు చెప్పినా సోషల్ మీడియాలో మళ్లీ ఇవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఆపండి. నా చర్యలు గానీ, నిర్ణయాలు గానీ జట్టు స్థాయిని దిగజార్చేలా ఏమాత్రం ఉండవు' అని విరాట్ కోహ్లీ (Virat Kohli) స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో జ‌రిగే వ‌న్డేల‌కు తానేమీ విశ్రాంతి కోర‌లేద‌ని, త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు వస్తున్నాయన్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook