Guess Who is She: స్కూల్ డ్రస్స్ లో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

స్కూల్ డ్రస్సులో అమాయకమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో ఐకాన్ గా మారడం సహా తనదైన డ్యాన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను దక్కించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 07:10 PM IST
Guess Who is She: స్కూల్ డ్రస్స్ లో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Sai Pallavi Childhood Photos: చూడగానే మన పక్కింటి అమ్మాయిలా, తనదైన అల్లరితో సందడి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆకట్టుకొనే అందం, అందుకు తగ్గ అభినయమున్న ఇలాంటి అమ్మాయి చిత్రపరిశ్రమలో ఒక్కటే పీస్​ అన్నంతగా కుర్రకారుకు మనసులను దోచేసింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. 

ఈ ముద్దుగుమ్మ 2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైంది. అటు తమిళ, మలయాళ సినిమాలతో పాటు తెలుగులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అటు నటనతో పాటు డ్యాన్స్ లతోనూ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తుంది. అయితే ముద్దులొలికే చిన్నారి మరెవరో కాదు మలయాళ బ్యూటీ సాయి పల్లవి. 'మలర్' పాత్రలో ప్రేక్షకులకు పరిచయమై అతికొద్ది నాళ్లలోనే స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అయితే సాయి పల్లవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

1) సాయి పల్లవి నటిగా ప్రయాణం మొదలుపెట్టక ముందు ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' డ్యాన్స్ షోలో పాల్గొంది. అయితే ఇందులో పాల్గొనేందుకు తొలుత ఆమె తల్లి ఒప్పుకోలేదట. కానీ కొన్ని రోజుల తర్వాత అంగీకారం తెలిపింది.

2) సాయి పల్లవి వెండితెరపై ప్రధాన పాత్రల్లో నటించడానికి ముందు కంగనా రనౌత్ నటించిన 'ధామ్ ధూమ్' చిత్రంలో సహాయ నటిగా కనిపించింది. 

3)  వెండితెరపై హీరోయిన్ గా సాయిపల్లవి నటించిన మొదటి చిత్రం 'ప్రేమమ్' (మలయాళం). ఈ సినిమాలో మలర్ పాత్రతో కుర్రకారు మనసుల్ని మాయ చేసింది. అయితే ఇందులో సాయి పల్లవిపై వచ్చే 'మలరే' సాంగ్​ను ఆమెకు తెలియకుండా చిత్రీకరించారు. ఈ పాటకు చాలా మంది అభిమానులున్నారు.  

Also Read: Valimai Making: బైక్‌పై నుంచి జారిపడిపోయిన స్టార్ హీరో.. అయినా కూడా!!

Also Read: అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News