నాగ్‌ పూర్: విదర్భ స్టేడియం వేదికగా భారత్ -శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. 4.5 ఓవర్ల వద్ద సమరవిక్రమ(13)ను ఇషాంత్ శర్మ  పెవిలియన్ కు పంపాడు. ఇషాత్ వేసిన అద్భుతమైన బంతిని ఆడేందుకు ప్రయత్నించి ఫస్ట్ స్లిప్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి సమరవిశ్రమ ఔట్ అయ్యాడు. కాగా ప్రస్తుతం శ్రీలంక 10 ఓవర్లు ముగిసే సమయానికి 31 పరుగులు చేసింది,  కరుణరత్నే 14  పరుగులు, తిరిమన్నే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్కంఠ పోరు..


ముడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో నెగ్గి సీరీస్ పై పట్టు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుత ఫాంను బట్టి చూస్తే టీమిండియాకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే శ్రీలంక యువజట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని పలువురు మాజీ క్రికెటర్లు వెల్లడిస్తున్నారు.