IND vs SL 3rd T20: శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లోనూ టీమిండియా (Team India) విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న భారత్..ఈ గెలుపుతో శ్రీలంకను (Sri Lanka) క్లీన్​స్వీప్​ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది.  కెప్టెన్‌ శనక (74 నాటౌట్‌; 38 బంతుల్లో 9×4, 2×6) రాణించటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అవేష్‌ఖాన్‌ (2/23) బంతితో ఆకట్టుకున్నాడు. అనంతరం స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి  విజయం సాధించింది. లంక బౌలర్లలో లహిరు కుమార రెండు వికెట్లు తీశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రేయస్ అయ్యర్ (Shreyas iyer) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా మూడో అర్ధసెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిరాశపరిచాడు. జడేజా (22 నాటౌట్‌)  మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా మరో 19 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. శ్రేయస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఈ సిరీస్‌లో 174.35 స్ట్రయిక్‌ రేట్‌తో శ్రేయస్ అయ్యర్ 204 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు చేసిన అతను మూడుసార్లు నాటౌట్ గా మిగలడం విశేషం. 




ఈ విజయంతో వరుసగా 12 టీ20లు గెలిచిన అఫ్గానిస్థాన్‌ రికార్డును భారత్ సమం చేసింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు (125) ఆడిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు షోయబ్ మాలిక్(124) పేరిట ఉండేది.


Also Read: Ishan Kishan: అభిమానులకు శుభవార్త.. ఆసుపత్రి నుంచి ఇషాన్ కిషన్ డిశ్చార్జ్! కానీ..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి