క్రీడా దేశంగా భారత్ పరివర్తన చెందుతుందని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ జోస్యం చెప్పాడు. ఈ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘భారత్‌ క్రీడాకారుల దేశంగా మారుతుందని తానెప్పుడూ ప్రస్తావిస్తుంటానని... మనది ఆటలను ప్రేమించే జాతి. ఆటలు ఆడటం ప్రారంభించినప్పుడే పరివర్తన సాధ్యం. ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ మంచిదే’ అని ఓ కార్యక్రమంలో సచిన్‌ అభిప్రాయపడ్డారు. 


సచిన్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ .. చిన్నప్పుడు తన బామ్మ ఎప్పుడూ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తుండేదని..దాన్ని తాను బలంగా నమ్ముతానని సచిన్ పేర్కొన్నాడు. మంచి ఆరోగ్యం క్రీడల ద్వార సాధ్యపడుతుందన్నారు. క్రీడలతోనే ‘శారీరక, మానసిక దృఢత్వం సాధ్యపడుందని... కాబట్టి ఏదో ఓ క్రీడను నిరంతరం ఆడండి’ అని సచిన్‌ సూచించాడు. ఏదో ఒక క్రీడను ఎంచుకొని క్రమ తప్పకుండా ఆడండి. అది మిమ్మల్ని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది.