IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం..2-1 ఆధిక్యంలోకి కోహ్లీసేన
IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దుసుకెళ్లింది.
IND vs ENG: ఇంగ్లాడ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయ ఢంకా మోగించింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్స్ ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక భూమిక పోషించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్(India) 191 పరుగులకే అలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్(England) జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పుంజుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీతో చెలరేగాడు. మిగతా ఆటగాళ్లు కూడా తొలి ఇన్నింగ్స్‌తో పోల్చితే మెరుగైన ఆటతీరు కనబరిచారు. శార్దుల్(Shardul Thakur), పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టీమ్‌ఇండియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్లు హసీబ్ హమీద్(63; 193 బంతుల్లో 6x4), రోరీ బర్న్స్(50; 125 బంతుల్లో 5x4) అర్ధశతకాలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ జోరూట్(36; 78 బంతుల్లో 3x4) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) నిలువనివ్వలేదు. ఇక ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీస పోరాటం చేయకుండా పెవిలియన్ బాటపట్టడంతో భారత్ అద్భుత విజయం సాధించింది. రోహిత్ కు 'ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.
Also Read:T20 World Cup 2021: పాక్ టీ20 జట్టు ప్రకటన...షోయబ్ మాలిక్, సర్ఫరాజ్‌లకు నో ఛాన్స్
50 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. దీంతో నేటి విజయం భారత్‌కు చారిత్రాత్మకమైందిగా నిలిచింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయంగా నిలిచింది. మరలా ఇన్నాళ్లకు కోహ్లీ(Kohli) సేన 2021లో విజయాన్ని నమోదు చేసింది.
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా
నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumra) అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్‌లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev) పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook