జయహో భారత్.. అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన ఇండియా
అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ తన సత్తా చాటింది. నాలుగో సారి వరల్డ్ కప్ గెలిచి యువసేన మరో మైలురాయిని దాటింది.
అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ తన సత్తా చాటింది. నాలుగో సారి వరల్డ్ కప్ గెలిచి యువసేన మరో మైలురాయిని దాటింది. 2000లో తొలిసారిగా శ్రీలంకపై, ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై, 2012లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్ తాజాగా 2018లో మళ్లీ ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా తమకిచ్చిన 217 టార్గెట్‌ని.. కేవలం 38.5 ఓవర్లలో అధిగమించిన భారత్ బ్యాట్స్‌మన్లలో మనోజ్ కల్రా (101), హార్విక్ దేశాయ్ (47) రాణించగా.. రెండు వికెట్ల నష్టానికి భారత్ 8 వికెట్ల తేడాతో గెలవడం గమనార్హం. ఆరు సంవత్సరాల తర్వాత భారత్ అండర్ 19 జట్టు మళ్లీ వరల్డ్ కప్ గెలవడం విశేషం.
వరల్డ్ కప్ ఫైనల్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ధాటికి కంగూరూలు నిజంగానే కంగారు పడినంత పనైంది. మన కుర్రాళ్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తూ బౌలింగ్ చేస్తూంటే.. అదేస్థాయి ఊపును పరుగుల వరదలను ఆపడానికి ఫీల్డర్లు కూడా ప్రదర్శించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 47.2లో ఓవర్లలో 216 పరుగులకే చేతులెత్తేసింది. ఇషాన్ పోరెల్ బౌలింగ్‌లో ఓపెనర్ బ్రయంత్ (14) ఓటయ్యాక.. కెప్టెన్ సంఘా(13) కూడా అనుకున్న స్థాయిలో ఏమీ ఆడకపోవడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.
అలాగే ఇషాన్ బౌలింగ్‌లోనే ఓపెనర్ ఎడ్వర్ట్స్(28) కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఆ తర్వాత వచ్చిన.. మెర్లో(76) కాస్త స్కోరు పెంచడానికి ప్రయత్నించారు. అయితే తనకు సహకారం ఇవ్వడంలో తర్వాత వచ్చిన ఆటగాళ్ళు గానీ, టెయిలెండర్లు గానీ ఫెయిల్ అవ్వడంతో స్కోరు 216 దగ్గరే ఆగిపోయింది. అయితే అదే స్కోరుని మన కుర్రాళ్లు అధిగమించి రికార్డును తిరగరాయడం విశేషం